Tips for bad breath: నోటి దుర్వాసనకు నిమిషాల్లో చెక్‌..! ఈ టిప్స్‌ ఫాలో అయితే చాలు..

|

Feb 28, 2024 | 9:55 PM

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే, నోటి దుర్వాసనను పోగొట్టడానికి మీరు పుదీనాను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఆకులను నమలండి లేదా పుదీనా టీతో పుక్కిలించండి. భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి.

Tips for bad breath: నోటి దుర్వాసనకు నిమిషాల్లో చెక్‌..! ఈ టిప్స్‌ ఫాలో అయితే చాలు..
Tips For Bad Breath
Follow us on

మనలో చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. నోటి దుర్వాసన వస్తుంటే ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. నోటి దుర్వాసనకు ప్రధాన కారణం సరిగ్గా బ్రష్ చేయకపోవడం. అయితే అలా కాకుండా పొట్టను సరిగ్గా శుభ్రం చేయకపోతే కూడా నోటి దుర్వాసన వస్తుంది. అయితే, నోటి దుర్వాసనను పోగొట్టే కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చిట్కాలు మనందరికీ మన నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

నోటి దుర్వాసన పోవడానికి ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటిలో పేరుకున్న బ్యాక్టీరియా తొలగిపోతుంది, ఇది నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే, నోటి దుర్వాసనకు పసుపు కూడా పనిచేస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. పసుపు దంతాల పసుపు పొరను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే, నోటి దుర్వాసనను పోగొట్టడానికి మీరు పుదీనాను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఆకులను నమలండి లేదా పుదీనా టీతో పుక్కిలించండి.

ఇవి కూడా చదవండి

భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్‌ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.

అయితే, దంతాలు, నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం నోటి దుర్వాసనకు కారణం కావొచ్చు. లేదంటే తరచూ నోరు పొడిబారడం కూడా. చిగుళ్ల సమస్యలు, దంతాల్లో క్యావిటీ, ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. డయాబెటిస్‌, సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం మరియు మద్యం, ఒత్తిడి, ఆందోళన, వంటివి కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. ఈ కారణాలను కూడా గమనించి నడుచుకోవటం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..