Lifestyle: సరిగ్గా నిద్రపోవడం లేదా.? మీకు ఈ సమస్య తప్పదంటున్న నిపుణులు..

|

Apr 01, 2024 | 9:20 PM

మరీ ముఖ్యంగా పనివేళల్లో మార్పులు, షిప్టులతో కూడిన పని విధానం, ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్‌తో ఎక్కువ సమయం గడపడం వంటి కారణాల వల్ల నిద్రలేమీ సమస్య పెరుగుతోంది. అయితే నిద్రలేమి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పరిశోధకులు నిద్రలేమితో కలిగే అనార్థాల గురించి...

Lifestyle: సరిగ్గా నిద్రపోవడం లేదా.? మీకు ఈ సమస్య తప్పదంటున్న నిపుణులు..
Sleep
Follow us on

నిద్రలేమి వినడానికి చిన్న సమస్యే అయినా అనుభవించేవారికే దీని విలువ తెలుస్తుంది. గంటలతరబడి కుస్తీలు పట్టినా నిద్రరాకపోతే, ఉదయం పని వేళలో కళ్లు మూత పడుతుంటే ఆ నరకం మాటల్లో చెప్పలేనిది. మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా నిద్రలేమీతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

మరీ ముఖ్యంగా పనివేళల్లో మార్పులు, షిప్టులతో కూడిన పని విధానం, ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్‌తో ఎక్కువ సమయం గడపడం వంటి కారణాల వల్ల నిద్రలేమీ సమస్య పెరుగుతోంది. అయితే నిద్రలేమి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పరిశోధకులు నిద్రలేమితో కలిగే అనార్థాల గురించి తెలుసుకోవడానికి ఓ పరిశోధన నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఈ పరిశోధన ప్రకారం.. దీర్ఘకాలంగా నిద్రలేమీ సమస్య అధిక రక్తపోటుకు దారి తీస్తుందని చెబుతున్నారు. అమెరిక‌న్ కాలేజ్ ఆఫ్ కార్డియాల‌జీ వార్షిక శాస్త్రీయ సెష‌న్‌లో ప‌రిశోధ‌కులు సమర్పించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 జ‌న‌వ‌రి నుంచి 2023 మే మ‌ధ్య చేప‌ట్టిన 16 అధ్య‌య‌నాల గ‌ణాంకాల‌ను విశ్లేషించిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. నిద్రలేమీ కారణంగా బీపీ పెరగడమే కాకుండా గుండె ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

పరిశోధనల్లో భాగంగా గతంలో హైబీపీ నేప‌ధ్యంలేని ఆరు దేశాల‌కు చెందిన 10,44,035 మందిలో హైప‌ర్‌టెన్ష‌న్‌ను గుర్తించారు. ఎలాంటి ఇతర దురలవాట్లతో సంబంధం లేకుండా నిద్రలేమి బీపీకి కారణమవుతుందని అధ్యయనంలో తేలింది. రోజుకు 5 గంటల కన్నా తక్కు నిద్రించే వారిలో బీపీ ముప్పు 11 శాతం అధికంగా ఉండ‌గా, రోజుకు ఏడు గంట‌ల క‌న్నా త‌క్కువ నిద్ర‌పోయేవారిలో బీపీ ముప్పు 7 శాతం పెరిగిన‌ట్టు శాస్రవేత్తలు గుర్తించారు. కచ్చితంగా రోజుకు ఏండు నుంచి ఎమినిది గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. లేదంటే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..