Skin Hydration: తగినన్ని నీళ్లు తాగడం లేదా? అయితే మీ ఆరోగ్యమే కాదు చర్మం కూడా త్వరలోనే..

|

Oct 15, 2023 | 9:29 PM

ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. తగినన్ని నీళ్లు తాగక పోవడం వల్లనే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయని చెబుతుంటారు. మీకు తెలుసా నీళ్లు అధికంగా తాగకపోవడం వల్ల ఆరోగ్యంతోపాటు చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. కొంత మంది ముఖంపై మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. ఫేషియల్ చేయించుకున్నా, డి-టాన్ సాయం తీసుకుంటున్నా, హోం రెమెడీస్‌తో స్కిన్ టోన్ పునరుద్ధరించడానికి..

Skin Hydration: తగినన్ని నీళ్లు తాగడం లేదా? అయితే మీ ఆరోగ్యమే కాదు చర్మం కూడా త్వరలోనే..
Skin Hydration
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. తగినన్ని నీళ్లు తాగక పోవడం వల్లనే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయని చెబుతుంటారు. మీకు తెలుసా నీళ్లు అధికంగా తాగకపోవడం వల్ల ఆరోగ్యంతోపాటు చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. కొంత మంది ముఖంపై మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. ఫేషియల్ చేయించుకున్నా, డి-టాన్ సాయం తీసుకుంటున్నా, హోం రెమెడీస్‌తో స్కిన్ టోన్ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించదు. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా నీళ్లు ఎక్కువగా తాగాలంటున్నారు నిపుణులు. చర్మం మెరుస్తూ ఉండాలంటే బాహ్య సంరక్షణ సరిపోదు. దానికి లోపల నుంచి కూడా పోషణ అందించాలి. చర్మ సంరక్షణలో మొదటి దశ చర్మ తేమను కాపాడుకోవడం. నీళ్లు ఈ పని చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

శరీరం తేమను కాపాడుకోకపోతే, చర్మం డల్‌గా కనిపిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం ద్వారా చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. హైడ్రేటింగ్ క్రీమ్‌లు సమర్థవంతంగా చేయలేని పనిని కూడా నీళ్లు మాత్రమే చేయగలదు. అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? అని ఆలోచిస్తున్నారా? రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుందని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మొటిమలను తగ్గించడంలో నీళ్లు నేరుగా కీలక పాత్ర పోషించదు. నిజానికి హైడ్రేటెడ్‌గా ఉంటే చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది. హైడ్రేషన్ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది.

శరీరానికి అవసరమైన నీళ్ల పరిమాణం వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. వయస్సు, లింగం, శారీరక శ్రమ, వాతావరణాన్ని బట్టి ఎంత మేరకు హైడ్రేషన్ అవసరమో తెలుస్తుంది. సాధారణంగా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతుంటారు. ఈ పరిమాణం వ్యక్తిని బట్టి మారినా.. రోజుకు 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే ప్రతిరోజూ 2 లీటర్ల నీళ్లు త్రాగాలన్నమాట. ఇంకా దాహం వేసినా లేదా మూత్రం ముదురు పసుపు రంగులో వచ్చినా శరీరంలో నీటి కొరత ఉందని అర్ధం. అలాంటి సందర్భాల్లో కూడా 8 గ్లాసుల కంటే ఎక్కువ నీళ్లు త్రాగాలి.

ఇవి కూడా చదవండి

తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని అన్ని కాలుష్య కారకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. చర్మం కూడా టాక్సిన్స్ లేకుండా ఉంటుంది. ఇది అనేక చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను రోజువారి డైట్‌లో చేర్చుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.