Skin Care: ఎండల్లో చర్మం నల్లబడుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే ఫేస్ టాన్ సమస్య దూరం.. ట్రై చేయండి..

వేసవిలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే చర్మ సమస్య ట్యానింగ్.. ఎండ వేడి వల్ల చర్మం పై పొరలోని మెలానిన్ పదార్థం. యాక్టివేట్ అవ్వడం ద్వారా చర్మం నల్లబడుతుంది. తద్వారా చామన చాయ్ గా ఉన్నవారు సైతం నల్లబడతారు. ముఖ్యంగా ఎండలో తిరిగే వారిలో ఈ టానింగ్ సమస్య ఎక్కువగా కనబడుతుంది. వేసవి మరో మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ చర్మాన్ని టానింగ్ బారిన పడకుండా ఏం చేయాలో తెలుసుకుందాం తద్వారా […]

Skin Care: ఎండల్లో చర్మం నల్లబడుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే ఫేస్ టాన్ సమస్య దూరం.. ట్రై చేయండి..
Sun Tan

Edited By:

Updated on: Apr 23, 2023 | 9:59 AM

వేసవిలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే చర్మ సమస్య ట్యానింగ్.. ఎండ వేడి వల్ల చర్మం పై పొరలోని మెలానిన్ పదార్థం. యాక్టివేట్ అవ్వడం ద్వారా చర్మం నల్లబడుతుంది. తద్వారా చామన చాయ్ గా ఉన్నవారు సైతం నల్లబడతారు. ముఖ్యంగా ఎండలో తిరిగే వారిలో ఈ టానింగ్ సమస్య ఎక్కువగా కనబడుతుంది. వేసవి మరో మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ చర్మాన్ని టానింగ్ బారిన పడకుండా ఏం చేయాలో తెలుసుకుందాం తద్వారా మీ చర్మం రంగు నల్లబడకుండా మీ ముఖాన్ని కాపాడుకోవచ్చు.

సన్ స్క్రీన్ క్రీమ్ రాసుకోవడం:

మార్కెట్లో లభించే పలు కంపెనీల సన్ స్క్రీన్ లోషన్ను అప్లై చేయడం ద్వారా మీరు ఈ టానింగ్ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా ఎండలోకి వెళ్లే ముందు మీరు మీ ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ను రాసుకోవడం మంచిది. అప్పుడు మీ చర్మం పై పొరలోకి సూర్యరశ్మి నుంచి వచ్చే, ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కీరా దోస ముక్కలతో ట్యానింగ్ దూరం:

కీరదోస ముక్కలను మెత్తగా నూరి ఆ ముద్దను మొహంపై ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం ద్వారా మీ చర్మాన్ని టానింగ్ నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కీరా దోష మొక్కల్లోని నీరు మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది తద్వారా చర్మం పైపులలోని మృత కణాలు తొలగిపోతాయి తద్వారా మీ చర్మం ట్యానింగ్ కాకుండా కాపాడుకోవచ్చు.

టమాటా రసంతో ట్యానింగ్ దూరం చేసుకోండి:

టమాటా రసం మీ చర్మానికి మంచి క్లీన్సింగ్ సాధనం. టమాటాలోని యాసిడ్ లక్షణాలు మీ చర్మం పైపులలోని మురికిని జిడ్డుని బ్యాక్టీరియాని తొలగిస్తాయి అలాగే మృత కణాలను కూడా తొలగించి మీ చర్మం ట్యానింగ్ బారిన పడకుండా కాపాడుతాయి తద్వారా మీరు మీ మొఖం ట్యానింగ్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.

ముల్తానీ మట్టితో ట్యానింగ్ దూరం చేసుకోండి:

ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా మీరు చర్మాన్ని టానింగ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోవడం ద్వారా టానిక్ బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంది.

కాఫీ పొడితో ట్యానింగ్ దూరం చేసుకోండి:

కాఫీ పొడిని రోజ్ వాటర్ తేనెలో కలిపి ముఖానికి అప్లై చేసుకొని 15 నిమిషాల పాటు ఉంచుకొని తరువాత చల్లటి నీటితో పడుకోవడం ద్వారా టానింగ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

– ముఖానికి ఐస్ ముక్కలతో మసాజ్ చేసుకోవడం ద్వారా కూడా ట్యానింగ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

– యాపిల్ సైడర్ వెనిగర్ ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా కూడా ఈ ట్యానింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

– అలాగే ఎండలోకి వెళ్ళినప్పుడు ముఖాన్ని కవర్ చేస్తూ ఫేస్ మాస్క్, లేదా కర్చీఫ్ ని కట్టుకోవడం ద్వారా కూడా ఈ టానింగ్ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..