Beauty Tips: వేసవిలో ముఖం మెరుపును కోల్పోయిందా?. అయితే ఈ ఆరెంజ్‌ ఫేషియల్‌ మీకోసమే..

|

Mar 19, 2022 | 5:44 PM

Skin Care Tips: అమ్మాయిలు తమ అందాన్ని మెరుగుపరచడం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా ఆశ్రయిస్తారు.

Beauty Tips: వేసవిలో ముఖం మెరుపును కోల్పోయిందా?. అయితే ఈ ఆరెంజ్‌ ఫేషియల్‌ మీకోసమే..
Follow us on

Skin Care Tips: అమ్మాయిలు తమ అందాన్ని మెరుగుపరచడం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా ఆశ్రయిస్తారు. అదేవిధంగా ఫేషియల్స్‌, క్లీనప్‌ల కోసం బ్యూటీపార్లర్లకు పరుగులు తీస్తుంటారు. ఇవి ఖరీదైనవే కాకుండా.. ఒక్కోసారి కెమికల్స్‌ ఎక్కువగా వాడడం వల్ల కొన్ని దుష్ర్పభావాలు కూడా కలుగుతాయి. అందుకే చర్మ సంరక్షణ (Skin Care) కోసం సహజ సిద్ధమైన విధానాలు, ఉత్పత్తులనే వినియోగించాలంటారు సౌందర్య నిపుణులు. ఇక విటమిన్లు- సి, ఏ సమృద్ధిగా ఉన్న ఆరెంజ్ (Orange) ఆరోగ్యానికి మాత్రమే కాదు. చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది. ముఖ్యంగా ఇందులోని డిటాక్సిఫైయింగ్‌ లక్షణాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. చర్మంలోని విష పదార్థాలను తొలగించడంతో పాటు మృతకణాలను తొలగిస్తాయి. ఇక ఆరెంజ్‌ సహాయంతో తరచుగా ఫేషియల్‌ చేసుకోవడం వల్ల ముఖం మెరుపును సంతరించుకుంటుంది. మరి అదెలాగో తెలుసుకుందాం రండి.

*ఆరెంజ్ ఫేషియల్ కోసం ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. క్లెన్సర్ చేయడానికి, ఒక టీస్పూన్ నారింజ రసం, ఒక టీస్పూన్ తేనె అవసరం. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి క్లెన్సర్‌ని సిద్ధం చేసి ముఖానికి పట్టించాలి. సుమారు 5 నిమిషాల తర్వాత శుభ్రమైన టవల్‌ లేదా క్లాత్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

*ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, ముఖాన్ని స్క్రబ్ చేయండి. ఫేస్ స్క్రబ్ కోసం, 1 టేబుల్ స్పూన్ నారింజ రసం, 1 స్పూన్ చక్కెర, స్పూన్ కొబ్బరి నూనె తీసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి మెడ నుంచి ముఖం వరకు అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. ఈ స్క్రబ్‌ని ముఖంపై సుమారు 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. ఆపై సుమారు 5 నిమిషాల పాటు ముఖానికి ఆవిరి పట్టించాలి. ఇలా చేయడం వల్ల స్వేదగ్రంథులు తెరచుకుంటాయి. మృతకణాలు, విష పదార్థాలు కూడా తొలగిపోయి ముఖం మృదువుగా మారుతుంది.

* ఫేస్ స్క్రబ్, స్టీమ్ తీసుకున్న తర్వాత ముఖానికి మసాజ్ చేయాలి. ఇందుకోసం ఒక చెంచా ఆరెంజ్ జ్యూస్, రెండు చెంచాల కలబంద రసాన్ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ నుంచి ముఖం వరకు పట్టించాలి. సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు అలా ఉంచిన తర్వాత శుభ్రమైన టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. కనీసం రెండువారాల కోసారి ఆరెంజ్‌తో ఫేషియల్‌ చేసుకోవడం వల్ల ముఖం మిలమిలా మెరుస్తుంది.

Also Read:Telangana Weather Report: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల కురిసిన వర్షం..

Japan PM Tour: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు భారత్‌‌లో ఘనస్వాగతం.. ప్రధాని మోడీతో కీలక ద్వైపాక్షిక చర్చలు

Yamini Bhaskar: య‌మ్మీ య‌మ్మీ స్టిల్స్ తో రభస బ్యూటీ.. యామిని భాస్కర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్