Dark Neck: మెడపై నలుపును చిటికెలో తొలగించే ఇంటిప్స్.. రోజూ స్నానానికి ముందు ఈ ఒక్కపని చేస్తేసరి

|

Oct 16, 2024 | 8:47 PM

కొంత మందికి మెడపై గాఢమైన నడుపు పేరుకుపోయి చూడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు ఇకపై ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మెడపై నలుపును చిటికెలో తొలగించే ఇంటి చిట్కాలు మీ కోసం ఇక్కడ ఇచ్చాం. వెంటనే ఫాలో అయిపోండి..

Dark Neck: మెడపై నలుపును చిటికెలో తొలగించే ఇంటిప్స్.. రోజూ స్నానానికి ముందు ఈ ఒక్కపని చేస్తేసరి
Dark Neck
Follow us on

పండగ వేళ మహిళలు తమ బట్టలు, అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పాదాల నుంచి చేతి వేళ్ల వరకు రకరాల ఆభరణాలతో అలంకరించుకుంటారు. అయితే చాలా మంది మహిళ మెడ నల్లగా ఉంటుంది. ఇదేమంత సమస్యకాదని చాలా మంది పట్టించుకోరు. మెడ మీద ఈ మొండి నలుపు కారణంగా నచ్చిన డ్రెస్‌ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేజర్ లేదా ఖరీదైన చికిత్స ద్వారా దీనిని చాలా వరకు తగ్గించవచ్చు. కానీ డబ్బు చెల్లించి చికిత్స తీసుకోవడం అందరికీ సాధ్యం కాదు. మెడపై ఉన్న ఈ నలుపును కొన్ని ఇంటి నివారణల ద్వారా తేలిగ్గా తొలగించవచ్చు. మెడపై ఉన్న నలుపుదనాన్ని పోగొట్టుకోవాలనుకుంటే, దాన్ని తగ్గించే కొన్ని చర్మ సంరక్షణ హోం రెమెడీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.. మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో రసాయనాలు ఉంటాయి. దీని వల్ల రియాక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. కానీ హోం రెమెడీస్ మంచి ఫలితాలను ఇవ్వగలవు.

అసలు మెడపై నలుపు ఎందుకు వస్తుంది?

మెడ, మోచేతులు, మోకాళ్లపై చర్మం ముదురు రంగులో ఉంటుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ భాగాల్లో చర్మం ఇతర ప్రాంతాల కంటే కాస్త నల్లగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన రంగు మెలనిన్ ద్వారా నిర్ణయించబడుతుంది. భారతీయులలో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ అధిక మంది ముదురు రంగులో ఉంటారు.

మెడ మీద నలుపును పోగొట్టడం ఎలా?

బంగాళదుంప రసం

చర్మంపై టానింగ్ లేదా డార్క్‌నెస్ ఉంటే దాన్ని వదిలించుకోవడానికి బంగాళాదుంప రసాన్ని అప్లై చేయవచ్చు. బంగాళాదుంప రసంలో ఉండే స్టార్చ్ చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నెలో బంగాళాదుంప రసాన్ని తీసుకుని, మెడ, మోచేతులు లేదా ఇతర నల్లటి చర్మం ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయడమే. అది ఆరిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చేయడానికి ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడాలో నిమ్మకాయ

మెడ మీద నలుపు తొలగించడానికి బేకింగ్ సోడా సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో అర నిమ్మకాయ రసాన్ని తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకోవాలి. ఈ రెండింటిలో అసిడిక్ గుణాలు ఉండటం వల్ల చర్మంపై నల్లదనాన్ని తగ్గిస్తుంది. అప్లై చేసిన కొన్ని నిమిషాల తర్వాత దాన్ని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

కోల్గెట్‌ పేస్ట్‌.. నిమ్మ, పసుపు, బేకింగ్ సోడా

మెడ లేదా మోచేతులపై నలుపు తగ్గించడానికి కోల్గేట్ టూత్‌పేస్ట్ కూడా బలేగా పనిచేస్తుంది. కోల్గేట్ పేస్టు, నిమ్మకాయ, పసుపు, బేకింగ్ సోడాలను ఒక గిన్నెలో కొంచెం కొంచెంగా తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి, నిమ్మతొక్కతో మసాజ్‌ చేయాలి. దీని ఫలితం వెంటనే కనిపిస్తుంది.

పసుపు

పసుపుతో మీ చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు. ఎందుకంటే ఇది యాంటీ బాక్టీరియల్, యాంటిసెప్టిక్ ఏజెంట్. పసుపులో ఉండే మూలకాలు మన చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా అర టీస్పూన్ పసుపులో నిమ్మరసం మిక్స్ చేసి, మెడపై మాస్క్ లాగా వేసుకోవడమే. ఇది ఆరిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. చివర్లో మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోకూడదు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.