రోజ్ ఫేస్ జెల్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి.. వేసవిలో కాంతివంతమైన, మెరిసే ముఖం మీ సొంతం..

|

May 15, 2024 | 3:21 PM

ఇంట్లో తయారుచేసిన నేచురల్ రోజ్ ఫేస్ జెల్ చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి తీసుకురావడానికి, ముఖం తాజాగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా, మృదువుగా ఉంచడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని చేయడానికి గులాబీ రేకులు, బాదం నూనె, గ్లిజరిన్, విటమిన్ ఇ క్యాప్సూల్ , అలోవెరా జెల్ అవసరం. వీటితో ఇంట్లోనే రోజ్ జెల్ ను తయారు చేసుకుని వాడుకోవచ్చు.

రోజ్ ఫేస్ జెల్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి.. వేసవిలో కాంతివంతమైన, మెరిసే ముఖం మీ సొంతం..
Skin Care Tips
Follow us on

వేసవిలో వేడి, చెమట కారణంగా చర్మం జిగటగా, నిస్తేజంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో అనేక రకాల చర్మ సంరక్షణ, సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. అయినప్పటికీ ముఖంలో మెరుపు కనిపించదు. స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా తమ చర్మం గ్లోను మెయింటెయిన్ చేయాలని.. ప్రతి సీజన్‌లో స్కిన్ ను తాజాగా ఉంచుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ సీజన్‌లో సూర్యకాంతి, వేడి, చెమట కారణంగా అనేక చర్మ సంబంధిత సమస్యలు మొదలవుతాయి.

వేసవి కాలంలో చల్లదనం ఇచ్చే వాటిని ముఖానికి రాసుకుంటే చర్మం చల్లబడుతుంది. కీర దోసకాయ, పెరుగు, కలబంద, రోజ్ వాటర్ వంటి పదార్ధాలను వివిధ మార్గాల్లో ఉపయోగిస్తారు. కొందరు వీటిని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌గా అప్లై చేస్తారు. చాలా మంది రోజ్ వాటర్ ను టోనర్ గా ఉపయోగించేందుకు ఇష్టపడతారు. అయితే మీరు దాని జెల్‌ను కూడా తయారు చేసి ముఖానికి రాసుకోవచ్చు.

ఇంట్లో తయారుచేసిన నేచురల్ రోజ్ ఫేస్ జెల్ చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి తీసుకురావడానికి, ముఖం తాజాగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా, మృదువుగా ఉంచడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని చేయడానికి గులాబీ రేకులు, బాదం నూనె, గ్లిజరిన్, విటమిన్ ఇ క్యాప్సూల్ , అలోవెరా జెల్ అవసరం. వీటితో ఇంట్లోనే రోజ్ జెల్ ను తయారు చేసుకుని వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రోజ్ ఫేస్ జెల్ ఎలా తయారు చేసుకోవాలంటే..

ముందుగా గులాబీ రేకులను తీసుకుని వాటిని బాగా కడిగిన తర్వాత వాటిని బ్లెండర్ జార్‌లో వేసి బాగా బ్లెండ్ చేయండి. ఆ తర్వాత కొన్ని చుక్కల బాదం నూనె వేసి బ్లెండ్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కటి జల్లెడ సహాయంతో ఫిల్టర్ చేయండి.

ఇప్పుడు ఒక గిన్నెలో గులాబీ రేకుల పేస్ట్ వేసి, ఇప్పుడు అందులో గ్లిజరిన్, విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్స్ వేసి బాగా మిక్స్ చేసి, అందులో అలోవెరా జెల్ వేసి, ఈ పేస్ట్ మెత్తగా జెల్ రూపంలో వచ్చే వరకు కలపాలి. అంతే ఇంట్లో తయారుచేసిన రోజ్ ఫేస్ జెల్ రెడీ. ఇప్పుడు దీనిని గాజు కంటైనర్‌లో నిల్వ చేసి ఉపయోగించండి. ఇది 4 నుండి 5 రోజుల వరకూ ఉపయోగపడుతుంది. మళ్ళీ సహజమైన రోజ్ ఫేస్ జెల్‌ను తయారు చేసుకోవాలి. ఎక్కువ రోజులు దీనిని నిల్వ చేసి ఉపయోగించవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..