Skin Care Tips: నెయ్యితో నైట్ క్రీమ్.. ఇలా చేస్తే సమస్యలన్నీ దూరమై చర్మం మెరుస్తుందట..!

|

Apr 13, 2024 | 8:27 AM

ప్రతి రాత్రి మీ ముఖానికి నెయ్యి రాసి మసాజ్ చేసుకుంటే మంచి మార్పును గమనిస్తారు. నెయ్యిలో విటమిన్ ఎ లభిస్తుంది. ఇది చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. ఫేషియల్ మసాజ్ కోసం కూడా నెయ్యిని ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలు ఉపశమనం పొందుతాయి.

Skin Care Tips: నెయ్యితో నైట్ క్రీమ్.. ఇలా చేస్తే సమస్యలన్నీ దూరమై చర్మం మెరుస్తుందట..!
Benefits Of Ghee For Skin
Follow us on

చాలా మంది ఆహారంలో భాగంగా నెయ్యిని ఉపయోగిస్తుంటారు. రోటీ, గంజి, కిచిడీ, ఉక్మా వంటి చాలా రకాల వంటకాల్లో నెయ్యిని ఉపయోగిస్తారు. అయితే నెయ్యితో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చర్మాన్ని మెరిసేలా చేయడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే నెయ్యిని ఉపయోగించవచ్చు. ముఖానికి నెయ్యిని వాడితే ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం.

ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. నెయ్యిలో కొవ్వులు, పోషకాలు ఉంటాయి. ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. దీంతో చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ప్రతి రాత్రి మీ ముఖానికి నెయ్యి రాసి మసాజ్ చేసుకుంటే మంచి మార్పును గమనిస్తారు. నెయ్యిలో విటమిన్ ఎ లభిస్తుంది. ఇది చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. ఫేషియల్ మసాజ్ కోసం కూడా నెయ్యిని ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలు ఉపశమనం పొందుతాయి.

చర్మం పొడిగా, గరుకుగా ఉన్నవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నెయ్యితో ముఖానికి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. నెయ్యిని చర్మంపై సున్నితంగా అప్లై చేయాలి. ఇది ముఖం కండిషనింగ్‌లో సహాయపడుతుంది. నెయ్యి సహాయంతో మీ చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. దీన్ని రోజూ ముఖంపై రాసుకుంటే ముడతలు తగ్గుతాయి. నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంలోని నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది.

ఇవి కూడా చదవండి

నెయ్యిని ఇలా వాడండి..

ఒక చెంచా నెయ్యిలో తేనె, నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి. దీన్ని ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. మీరు నెయ్యిని క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు మీ వేళ్లతో కొంచెం నెయ్యి తీసుకుని ముఖం మీద తేలికపాటి మసాజ్ చేయాలి. తరచూగా ఇలా చేయడంతో మీరు మీ ముఖాన్ని సులభంగా మెరిసేలా చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే.. అందరి చర్మం ఒకేలా ఉండదు. ప్రతిఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. నెయ్యి కొందరి చర్మానికి సరిపోతుంది, మరికొందరి చర్మానికి కాదు. నెయ్యి వాడటం వల్ల ముఖంపై ఎర్రటి దద్దుర్లు వంటి సమస్యలు ఎదురైతే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…