Refrigerator: ఫ్రిడ్జ్ కొనుగోలు చేయడానికి చూస్తున్నారా.. సింగిల్ డోర్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఏది బెస్ట్ అంటే..

|

Mar 26, 2023 | 11:04 AM

వేసవి కాలం వచ్చిందంటే ఫ్రిడ్జ్ కు డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రిఫ్రిజిరేటర్లలో కూడా అనేక మార్పులు వచ్చి రాకరకాలున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకూ ఉపయోగించేందుకు రకరకాల రిఫ్రిజిరేటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

Refrigerator: ఫ్రిడ్జ్ కొనుగోలు చేయడానికి చూస్తున్నారా.. సింగిల్ డోర్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఏది బెస్ట్ అంటే..
Single door refrigerator vs double door refrigerator
Follow us on

కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా మానవ జీవితంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కాలంతో పరుగులు పెడుతూ పనులు చేసుకోవలసిందే నేటి మహిళ దీంతో ఎలక్రికల్ వస్తువులు వంటింట్లో చోటు దక్కించుకున్నాయి. మారిన పరిస్థితులు, అవసరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జ్, ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్ తప్పనిసరయ్యాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ఫ్రిడ్జ్ కు డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రిఫ్రిజిరేటర్లలో కూడా అనేక మార్పులు వచ్చి రాకరకాలున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకూ ఉపయోగించేందుకు రకరకాల రిఫ్రిజిరేటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ , మల్టీ డోర్ ఫ్రిడ్జ్ లు ఉన్నాయి. అయితే చాలామందికి సింగిల్ డోర్ ఫ్రిజ్ బెటరా? డబుల్ డోర్ ఫ్రిజ్ బెటరా? అన్న సందేహం ఉంటుంది.  ఈరోజు ఏ  ఫ్రిడ్జ్ ఎటువంటి ఉపయోగాలను ఇస్తాయి.. తెలుసుకుందాం..

సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్: వీటి సైజ్ లో చాలా చిన్నగా ఉంటుంది. కనుక వీటిని ఇంట్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు. అంతేకాదు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ తో పోలిస్తే విద్యుత్ వినియోగం కూడా తక్కువే.. వీటిలో పెట్టే ఆహారం, డ్రింక్స్ వంటివి కూల్ గా ఉండడానికి డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. చిన్న ఫ్యామిలీకి ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ బెస్ట్ ఆప్షన్.

డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్: ఈ ఫ్రిడ్జ్ కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది. ఎక్కువమంది సభ్యులున్నవారు ఈ రిఫ్రిజిరేటర్ ఎంపిక చేసుకోవడం బెస్ట్. ఈ రిఫ్రిజిరేటర్ లో కూలింగ్ కోసం స్పెషల్ డోర్ ఉంటుంది. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే టెక్నాలజీ కూరగాయలు లేదా ఇతర వస్తువులు ఎక్కువ కాలం నిల్వ చేయబడతాయి. అంతేకాదు ఫ్రీజర్‌ను యాక్సెస్ చేయడానికి రిఫ్రిజిరేటర్ తలుపుని తెరవాల్సిన అవసరం ఉండదు. లుక్ కూడా బాగుంటుంది. అయితే డబుల్ డోర్ ఫ్రిజ్ ఖరీదు కొంచెం ఎక్కువ. అంతేకాదు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువే. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ల్లో ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీంతో పని చేయడానికి 30-40 శాతం ఎక్కువ విద్యుత్ అవసరం.

ఇవి కూడా చదవండి

మల్టీ డోర్ ఫ్రిడ్జ్: ఇది ఒక బీరువా లా ఉంటుంది. ఎక్కువ ఆహారం, వాటర్ బాటిల్స్ వంటి వాటిని దీనిలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఈ రకం ఫ్రిడ్జ్ లను హోటల్స్ వంటి వ్యాపార సముదాయాల్లో వినియోగిస్తారు.

ఏ రకమైన ఫ్రిడ్జ్ మంచిదంటే.. 

ఏ రకమైన రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయాలనున్నా ముందుగా ఇంటి అవసరాలు, ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాదు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇంట్లో స్థలం, విద్యుత్ వినియోగం, ఉపయోగం వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కరెంట్ బిల్ కట్టే ఆర్ధిక స్తొమత ఉంటే.. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్  బెస్ట్ ఎంపిక.. అయితే ఇంటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తక్కువ ఖర్చుతో రిఫ్రిజిరేటర్ కొంగలు చేయాలనుకునే వారికీ సింగిల్ డోర్ ఫ్రిజ్ మీకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిల్క్ చేయండి,,