జిడ్డుగా మారిన స్విచ్ బోర్డ్‌ను శుభ్రం చేయడానికి భయపడుతున్నారా..? ఇలా చేస్తే మెరుపుఖాయం..

|

Jun 28, 2023 | 4:26 PM

ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్విచ్ బోర్డుని శుభ్రపరిచే ముందు ఇంటి మెయిన్‌ కరెంట్‌ కనెక్షన్ స్విచ్ ఆఫ్ చేయాలి. దీంతో మీరు షాక్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్విచ్‌బోర్డ్‌ను శుభ్రపరిచేటప్పుడు మీ చేతులకు రబ్బరు గ్లోవ్స్, మీ పాదాలకు పొడి చెప్పులు ధరించడం మర్చిపోవద్దు.

జిడ్డుగా మారిన స్విచ్ బోర్డ్‌ను శుభ్రం చేయడానికి భయపడుతున్నారా..? ఇలా చేస్తే మెరుపుఖాయం..
Clean A Dirty Switch Board
Follow us on

స్విచ్ బోర్డ్స్ క్లీనింగ్: ఇంటిని నీట్‌గా క్లీన్ గా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా క్లీన్ చేయడం దగ్గర నుంచి ప్రత్యేకంగా అలంకరించుకోవడం వరకు మన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటాం. ఇంటి క్లీనింగ్‌, డస్టింగ్‌లో భాగంగా ఫ్లోర్, ఫర్నిచర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తాము. కానీ మురికిగా ఉన్న స్విచ్ బోర్డుని మనం గమనించలేము. ఎందుకంటే మనం నీటితో తుడిచి శుభ్రం చేయలేము. కాబట్టి దానిని శుభ్రం చేయకుండానే వదిలేస్తుంటాము. కానీ, మురికిగా మారిన స్విచ్ బోర్డ్‌ను ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

స్విచ్ బోర్డును ఎలా శుభ్రం చేయాలో తెలుసా..?

మురికిగా మారిన స్విచ్ బోర్డులు ఇంటి రూపాన్ని పాడు చేస్తాయి. కొందరు దీని కోసం ప్రతి సంవత్సరం మొత్తం స్విచ్ బోర్డునే మారుస్తుంటారు. కానీ, అలా చేయాల్సిన అవసరం లేదు. స్విచ్ బోర్డులపై ఉన్న పసుపు, నలుపు రంగులను క్లీన్ చేస్తుండగా షాక్ తగులుతుందనే భయం కూడా ఉంది. కానీ ఈ పదార్థాలను ఉపయోగించి ఇంట్లోని స్విచ్‌ బోర్డును శుభ్రం చేస్తే ఎలాంటి విపత్తు సంభవించదు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్విచ్ బోర్డుని శుభ్రపరిచే ముందు ఇంటి మెయిన్‌ కరెంట్‌ కనెక్షన్ స్విచ్ ఆఫ్ చేయాలి. దీంతో మీరు షాక్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్విచ్‌బోర్డ్‌ను శుభ్రపరిచేటప్పుడు మీ చేతులకు రబ్బరు గ్లోవ్స్, మీ పాదాలకు పొడి చెప్పులు ధరించడం మర్చిపోవద్దు.

ఇక ఇప్పుడు స్విచ్‌ బోర్డును ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..

1. బేకింగ్ సోడా: స్విచ్ బోర్డ్ శుభ్రం చేయడానికి కూడా బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి అందులో నిమ్మకాయను పిండాలి. ఇప్పుడు పాత టూత్ బ్రష్ సహాయంతో స్విచ్ బోర్డ్‌పై మిశ్రమాన్ని రుద్దండి, ఇది బోర్డ్‌ను పూర్తిగా శుభ్రపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

2. వైట్ వెనిగర్ : స్విచ్ బోర్డ్ శుభ్రం చేయడానికి వైట్ వెనిగర్ వాడకం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం1 కప్పు నీటిలో 2 చెంచాల వెనిగర్, 1 చెంచా నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఈ ద్రావణంలో టూత్ బ్రష్ మొత్తటి బట్టను ముంచి స్విచ్ బోర్డుని తుడవండి. ఇది మీ స్విచ్‌బోర్డ్‌ను తక్షణమే ప్రకాశింపజేస్తుంది.

స్విచ్ బోర్డ్ శుభ్రం చేసిన వెంటనే ఇంటి మెయిన్ స్విచ్ ఆన్ చేయకూడదు. కాసేపు అలాగే వదిలేయండి. స్విచ్ బోర్డ్ శుభ్రం చేసిన తర్వాత 30-40 నిమిషాల తర్వాత మాత్రమే మెయిన్‌ బోర్డ్ ఆన్ చేయండి. బోర్డు పూర్తిగా పొడిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే స్విచ్ ఆన్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..