Kitchen Hacks: గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో అని టెన్షన్ పడుతున్నారా..! అయితే ఇలా చెక్ చేసుకోండి..!

ఇంట్లో వంట చేయడానికి ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగిస్తారు. అయితే గ్యాస్ ఎంత మిగిలి ఉందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం. అనేకమంది అనుకోకుండా గ్యాస్ అయిపోతే ఇబ్బందులు పడతారు. కానీ కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా సిలిండర్‌లో మిగిలిన గ్యాస్‌ను అంచనా వేసుకోవచ్చు.

Kitchen Hacks: గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో అని టెన్షన్ పడుతున్నారా..! అయితే ఇలా చెక్ చేసుకోండి..!
Untitled Design 2025 02 08t142416.408

Updated on: Feb 08, 2025 | 2:26 PM

సిలిండర్‌పై తడి బట్టతో పరీక్ష చేయడం, స్టవ్ మంటను గమనించడం, గ్యాస్ వాసన, పొగను పరిశీలించడం వంటి పద్ధతులు అంచనా వేయడంలో ఉపయోగపడతాయి. అలాగే సిలిండర్ బరువు చూసి గ్యాస్ స్థాయిని అంచనా వేయవచ్చు. ఈ చిన్న చిట్కాలతో ముందుగానే గ్యాస్ స్థితిని తెలుసుకొని వెంటనే గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. లేదా వేరే ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు.

తడి బట్టతో పరీక్షించండి

సిలిండర్‌పై ఒక తడి బట్టను చుట్టి 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తడి బట్టను తీసివేయండి. తేమ ఎక్కడి వరకు ఉందో గమనించండి. అదే స్థాయిలో గ్యాస్ మిగిలి ఉందని అర్థం.

స్టవ్ మంటను గమనించండి

స్టవ్‌లో మంట నీలంగా, ఉజ్వలంగా ఉంటే గ్యాస్ సరిగ్గా ఉందని తెలుస్తుంది. కానీ మంట పసుపు రంగులోకి మారితే లేదా బలహీనంగా ఉంటే గ్యాస్ త్వరలో అయిపోబోతుందని అర్థం.

గ్యాస్ వాసన, పొగ

గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు గ్యాస్ వాసన వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్టవ్ వెలిగించినప్పుడు నల్లని పొగ వస్తే గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతున్న సూచనగా భావించవచ్చు.

సిలిండర్ బరువు

సిలిండర్‌ను నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. పూర్తి గ్యాస్ ఉన్న సిలిండర్ బరువుగా అనిపిస్తుంది. కానీ గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు తేలికగా ఉంటుంది.

నీరు పోసి పరీక్షించండి

సిలిండర్‌పై కొద్దిగా నీరు పోయండి. గ్యాస్ లేని భాగం వేడిగా మారుతుంది. కాబట్టి నీరు త్వరగా ఆరిపోతుంది. కానీ గ్యాస్ నిండిన భాగం చల్లగా ఉండడం వల్ల నీరు కొద్దిసేపు అక్కడే ఉండిపోతుంది.

జాగ్రత్తలు

కొత్త సిలిండర్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు, దాని సీల్, రెగ్యులేటర్‌ను సరిచూసుకోవాలి. ఏదైనా లీకేజీ లేదా సమస్య ఉంటే, వెంటనే గ్యాస్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించడమే కాకుండా గ్యాస్ వృధాను కూడా తగ్గించుకోవచ్చు. ఈ చిన్నచిన్న టిప్స్ పాటించడం ద్వారా గ్యాస్ సిలిండర్‌లో మిగిలిన గ్యాస్‌ని సులభంగా అంచనా వేసుకోవచ్చు.