AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుప్పల్లో ఉంటుందని చిన్న చూపు చూసేరు.. డైలీ ఓ గ్లాసు తాగితే రోగాలే షేకవుతాయి.. దెబ్బకు పొట్ట కరిగిపోతుంది

చాలామంది చిన్నచూపు చూసే బూడిద గుమ్మడికాయలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. బూడిద గుమ్మడి జ్యూస్‌ను రోజూ ఒక గ్లాసు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో పొటాషియం, క్యాల్షియం, విటమిన్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉండటంతో డయాబెటిస్, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తుప్పల్లో ఉంటుందని చిన్న చూపు చూసేరు.. డైలీ ఓ గ్లాసు తాగితే రోగాలే షేకవుతాయి.. దెబ్బకు పొట్ట కరిగిపోతుంది
Ash Gourd Juice Benefits
Shaik Madar Saheb
|

Updated on: May 17, 2026 | 7:47 PM

Share

చాలా మంది బూడిద గుమ్మడికాయను లైట్ తీసుకుంటారు. కానీ, గుమ్మడిలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి. అయితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బూడిద గుమ్మడి జ్యూస్ తయారీ విధానం.. దాని అద్భుతమైన ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడిని సాధారణంగా మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాము. కానీ ఇది ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుతమైన కూరగాయ. దీనిని తెల్ల గుమ్మడి, కూష్మాండం, వింటర్ మెలన్, వాక్స్ గార్డ్, చైనీస్ వాటర్ మెలన్ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. బూడిద గుమ్మడితో చేసే హల్వా, వడియాలు ప్రసిద్ధం. కానీ దాని జ్యూస్ మాత్రం అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

ఈ బూడిద గుమ్మడి రసం శరీరానికి అవసరమైన అనేక సూక్ష్మపోషకాలను అందిస్తుంది. ఇందులో పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్, పీచు పదార్థం, బి1, బి9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీర పనితీరుకు కీలకం. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఇది సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు 21 రోజులు ఈ జ్యూస్ తాగడం వల్ల ఉపశమనం పొందినట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇది ఊబకాయాన్ని నివారిస్తుంది.. బరువు తగ్గడంలో కూడా తోడ్పడుతుంది.

బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. ఇంకా వేళకు ఆకలి వేస్తుంది. శరీరంలో చేరిన హానికరమైన విష పదార్థాలను బయటకు పంపడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. చర్మం పొడిబారకుండా కాంతివంతంగా మారడానికి కూడా ఈ జ్యూస్ దోహదపడుతుంది. జ్వరం, దగ్గుల నుంచి ఉపశమనం కలిగించి, యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బూడిద గుమ్మడి జ్యూస్ తయారు విధానం..

బూడిద గుమ్మడి జ్యూస్ తయారుచేయడం చాలా సులభం. ముందుగా మార్కెట్ నుండి తీసుకొచ్చిన బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడగాలి. తర్వాత దానిని రెండు భాగాలుగా కట్ చేసి, లోపల ఉన్న గింజల భాగాన్ని పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత పైన ఉండే చెక్కు (తొక్క)ను కూడా తీసివేయాలి. ఇప్పుడు గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక జ్యూసర్ జార్ తీసుకొని, అందులో కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడి ముక్కలు వేయాలి. దీనికి కొన్ని అల్లం ముక్కలు, రాళ్ల ఉప్పు (లేదా సాధారణ ఉప్పు) వేయాలి. ఒక గ్లాసు నీటిని పోసి, మిక్సీని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిశ్రమం తయారైన తర్వాత, ఒక శుభ్రమైన వస్త్రాన్ని లేదా నెట్ స్ట్రైనర్‌ను ఉపయోగించి జ్యూస్‌ను వడకట్టాలి. ఇలా వడకట్టడం వల్ల త్రాగేటప్పుడు ఎలాంటి చిన్న ముక్కలు తగలకుండా చక్కగా ఉంటుంది.

ఈ జ్యూస్ తయారుచేయడం సులభం, ఇది మనందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఇంకా తక్కువ రేటుకే దొరుకుతుంది. ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బూడిద గుమ్మడి జ్యూస్‌ను మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

అయితే.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. గుమ్మడిని తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us