Lifestyle: నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలకు ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..
మనిషి శరీరంలో దాదాపు 60 శాతం నీరు ఉంటుంది. శరీరంలో అన్ని క్రియలు సక్రమంగా సాగాలంటే నీరు అవసరం ఎంతో ఉంటుంది. వివిధ కణాలకు పోషకాలను రవాణా చేయడం నీరు అవసరపడుతుంది. కీళ్లను లూబ్రికేట్ చేయడంలో, ఆహారం జీర్ణం కావడంలో నీరు ఉపయోగపడుతుంది. అయితే తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ బారినపడే అవకాశం పెరుగుతుంది...

మనిషి ఆరోగ్యంగా ఉండడంలో నీటిది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిపడ నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటాం. ఇక కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ మంచి నీరు కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. దీంతో శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అధికంగా నీరు తాగితే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నీరు ఎక్కువగా తీసుకుంటే జరిగేది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి శరీరంలో దాదాపు 60 శాతం నీరు ఉంటుంది. శరీరంలో అన్ని క్రియలు సక్రమంగా సాగాలంటే నీరు అవసరం ఎంతో ఉంటుంది. వివిధ కణాలకు పోషకాలను రవాణా చేయడం నీరు అవసరపడుతుంది. కీళ్లను లూబ్రికేట్ చేయడంలో, ఆహారం జీర్ణం కావడంలో నీరు ఉపయోగపడుతుంది. అయితే తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ బారినపడే అవకాశం పెరుగుతుంది. అయితే నీరు తాగడం ఎంత మంచితో అధికంగా తాగితే అంతే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
మోతాదుకు మించి నీరు తాగితే కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై పనిభారాన్ని పెంచుతుంది. అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల కూడా కిడ్నీకి ప్రమాదం ఏర్పడుతుంది. కిడ్నీ సంబంధిత వసమస్యలు రావడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇంతకీ నీరు ఎంత తీసుకోవాలనేగా మీ సందేహం. సగటున ఒక వ్యక్తి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ లెక్కన సుమారు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎండలో ఎక్కువ సేపు ఉండే వారు, శారీరక వ్యాయామాలు చేసే వారు ఎక్కువగా నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే నీరు తక్కువయినా ప్రమాదం తప్పదని చెబుతున్నారు. తక్కువ నీరు తీసుకుంటే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, మలబద్ధకం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




