Milk Tea: టేస్ట్ కోసం మిల్క్ టీని ఎక్కువ సేపు మరిగించి తాగుతున్నారా.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..

|

Jun 26, 2024 | 12:07 PM

భారతీయులు తమకు ఇష్టమైన రుచి, ఆరోగ్యాన్ని బట్టి టీ తాగడాన్ని ఇష్టపడతారు. రుచి, ఆరోగ్యం ప్రకారం గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ , మిల్క్ టీలను ఇష్టపడతారు. వీటిల్లో ప్రధాన ఎంపిక మిల్క్ టీ అని చెప్పవచ్చు. టీ తయారు చేసే సమయంలో ముదురు రంగులోకి వచ్చే వరకు ఎక్కువసేపు మరిగిస్తారు. లేదా టీ స్ట్రాంగ్ గా ఉండాలని ఎక్కువ టీ ఆకులను వేస్తారు. అప్పుడు టీ ముదురు రంగులోకి మారడమే కాదు చేదు రుచికి వస్తుంది.

Milk Tea: టేస్ట్ కోసం మిల్క్ టీని ఎక్కువ సేపు మరిగించి తాగుతున్నారా.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..
Milk Tea Side Effects
Follow us on

బ్రిటిష్ టీ తయారీని సొంతం చేసుకున్న భారతీయులు మరిన్ని ప్రయోగాలు చేసి రకరకాల టీలను తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగానే కాదు మన దేశంలో కూడా టీని ఇష్టపడేవారికి కొదవలేదు. కొంతమందికి టీ అంటే చాలా ఇష్టం ఎంతగా అంటే రోజుని టీ తాగడంతోనే మొదలు పెడతారు. టీ తాగడంతోనే రోజుని ముగిస్తారు కూడా..భారతీయులు తమకు ఇష్టమైన రుచి, ఆరోగ్యాన్ని బట్టి టీ తాగడాన్ని ఇష్టపడతారు. రుచి, ఆరోగ్యం ప్రకారం గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ , మిల్క్ టీలను ఇష్టపడతారు. వీటిల్లో ప్రధాన ఎంపిక మిల్క్ టీ అని చెప్పవచ్చు. టీ తయారు చేసే సమయంలో ముదురు రంగులోకి వచ్చే వరకు ఎక్కువసేపు మరిగిస్తారు. లేదా టీ స్ట్రాంగ్ గా ఉండాలని ఎక్కువ టీ ఆకులను వేస్తారు. అప్పుడు టీ ముదురు రంగులోకి మారడమే కాదు చేదు రుచికి వస్తుంది.

కొందరికి టీని ఎక్కువ సేపు మరిగించి తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం ఖచ్చితంగా టీ రుచిని పెంచుతుంది. అయితే ఆరోగ్య పరంగా ఇలా చేయడం ఏమాత్రం ప్రయోజనకరం కాదు. ఎక్కువసేపు మరిగించిన టీ మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల టీ తాగడం ఇష్టపడేవారు టీని ఎంతసేపు మరిగించాలి ఈ రోజు తెలుసుకుందాం..

టీ ఎంతసేపు మరిగించాలంటే

ఇవి కూడా చదవండి

టీ తయారీకి అవసరమైన అన్ని పదార్థాలను జోడించిన తర్వాత.. 4-5 నిమిషాలు మాత్రమే మరిగించండి. మీరు టీని ఎక్కువసేపు మరిగించినట్లు అయితే ఆ టీ తాగడం వలన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. టీని ఎక్కువ సేపు మరించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.

శరీరంలో ఐరన్ , కాల్షియం లోపం
మిల్క్ టీని ఎక్కువ సేపు మరిగించడం వలన అందులో టానిన్ పరిమాణం పెరుగుతుంది. టానిన్ల పరిమాణం పెరగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో బాగా మరిగించి టీ తాగే అలవాటు ఉన్న వారు త్వరలో రక్తహీనతకు గురవుతారు.

అసిడిటీ సమస్య
మిల్క్ టీని ఎక్కువగా మరిగించడం వల్ల దాని pH స్థాయి పెరుగుతుంది. ఇది టీని మరింత ఆమ్లంగా చేస్తుంది.

జీర్ణ సమస్యలు
టీని ఎక్కువసేపు మరిగించడం వలన దానిలోని ఆమ్ల గుణాలు పెరుగుతాయి. అప్పుడు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

అధిక రక్తపోటు
ఇంతకుముందు తయారుచేసిన టీని మళ్ళీ మళ్ళీ మరిగించి తాగితే దానిలో టానిన్ పరిమాణం మునుపటి కంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది శరీరంలోని రక్తపోటును పెంచుతుంది.

పోషకాలలో లోపం
పాల టీని పదే పదే మరిగించి తాగడం వల్ల పాలలో ఉండే ప్రొటీన్, విటమిన్ డి, కాల్షియం వంటి అనేక పోషకాలు తగ్గుతాయి. లేదా పూర్తిగా నాశనం అవుతాయి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)