Smartphone addiction: ఇలా చేస్తే.. పిల్లల నుంచి మొబైల్ వ్యసనాన్ని దూరం చేయ్యొచ్చు..

నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో టెక్నాలజీని పిల్లలూ త్వరగా అందిపుచ్చుకుంటున్నారు. దీంతో మొబైల్ ఫోన్లకు చాలామంది పిల్లలు

Smartphone addiction: ఇలా చేస్తే.. పిల్లల నుంచి మొబైల్ వ్యసనాన్ని దూరం చేయ్యొచ్చు..
Mobile Addiction
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 15, 2022 | 1:46 PM

Smartphone addiction: నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో టెక్నాలజీని పిల్లలూ త్వరగా అందిపుచ్చుకుంటున్నారు. దీంతో మొబైల్ ఫోన్లకు చాలామంది పిల్లలు అతుక్కుపోతున్నారు. పిల్లల నుంచి స్మార్ట్ ఫోన్ల వ్యసనాన్ని తొలగించడానికి తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. భోజనం చేయాలన్నా, చదవాలన్నా ఫోన్ కావల్సిందే అంటూ పిల్లలు మారం చేస్తుంటే.. వారిని ఈవ్యసనం నుంచి ఎలా దూరం చేయాలే తెలియక చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలా చేస్తే పిల్లల నుంచి స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని దూరం చేయ్యొచ్చు అంటున్నారు పలువురు సైకాలిస్టులు.. స్మార్ట్‌ఫోన్ కు అలవాటుపడటం వలన, అది పిల్లల మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, చదువు, నిద్ర వంటివాటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఈక్రింది చిట్కాలతో పిల్లల నుంచి స్మార్ట్ ఫోన్ల వ్యసనాన్ని దూరం చేయ్యొచ్చు.

గుర్తించడం: పిల్లలు స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలతో ఎంత సమయం గడుపుతున్నారో గుర్తించాలి. తొలుత పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకంలో ఏంత తలమునకలయ్యారో తెలుసుకోవాలి. కేవలం కొంత సమయం వినోదం కోసం ఫోన్ ను ఉపయోగిస్తున్నాడా.. లేదా స్మార్ట్ ఫోన్ కు బానిసయ్యడా అనేది గుర్తించాలి. మొదట పిల్లల నుంచి ఫోన్ తీసుకునేటప్పుడు ఎలా స్పందిస్తున్నాడో తెలుసుకోవాలి. ఫోన్ తీసుకోగానే పిల్లలు కోపడుతున్నారా లేదా అనేది గమనించాలి. దాని ఆధారంగా వారి దృష్టిని ఫోన్ నుంచి ఎలా మరల్చాలనేదానిపై దృష్టిపెట్టాలి.

దుష్ప్రభావాల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం: పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతిసారీ వారి నుండి ఆఫోన్ ను తీసివేయడానికి బదులు.. ఎక్కువ సేపు ఫోన్ చూడటం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి పిల్లల్లో అవగాహన కల్పించి.. దానిని వారు స్వీకరించేలా చేయాలి. వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. దీంతో పిల్లల్లో కొంత మార్పు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

సమయాన్ని సెట్ చేయండి: పిల్లలు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయానికి లిమిటేషన్ సెట్ చేయాలి. 18 నెలలకన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫోన్ స్ర్కీన్ చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 18 నుంచి 24 సంవత్సరాలు వయస్సు గల పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో నాలెడ్జ్ ని పెంచే బొమ్మలు వంటి వాటిని చూపిస్తే చాలు. 2 నుంచి5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలు రోజుకు ఒక గంటకు మించకుండా సమయాన్ని కేటాయించాలి. 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు నిద్రపోయే సమయం, చదువుకునే సమయం వృధా కాకుండా నిర్ణీత కాల పరిమితిని సెట్ చేయాలి.

బెడ్ రూమ్ లో ఫోన్ ను అందుబాటులో ఉంచకండి: పిల్లలు పడుకునే బెడ్‌రూమ్‌లో ఫోన్లు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రపోయిన సమయంలో వారికి ఫోన్ అందుబాటులో ఉంటే అది పిల్లల పెరుగుదల, అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. చీకటి పడిన తర్వాత పిల్లలు స్క్రీన్‌ల వైపు ఎక్కువ సమయం వెచ్చించకుండా చూసుకోవాలి. పిల్లలు ఫోన్ కోసం మారం చేసినా వారికి ఆసమయంలో లొంగిపోకుండా ఫోన్ ను దూరంగా ఉంచాలి.

శారీరక వ్యాయమం చేసేలా ప్రోత్సహించండి: పిల్లలు బయట స్నేహితులతో ఆడుకోవడానికి, శారీక వ్యాయమం చేసేలా ప్రోత్సహిస్తే ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువల వాడకానికి వారు దూరంగా ఉంటారు. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎక్కువ సమయం గడుపుతున్నట్లు అనిపిస్తే టైమ్ లిమిట్ సెట్ చేసి.. ఆసమయం దాటిన తరువాత మొబైల్ ఫోన్ ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలి. ఇంట్లో స్మార్ట్ ఫోన్ వాడకుండా కొద్ది రోజులు గడపాలి. తద్వారా పిల్లలకు ఫోన్ పై దృష్టిని మరల్చవచ్చు. ఇంట్లో ఉండే సమయంమలో వారిని ఇంటి పనుల్లో భాగస్వామ్యం చేయాలి. అవసరమైతే వారికి ఇష్టం ఉన్న కళల్లో శిక్షణ ఇప్పిచడం మేలు.

రోల్ మోడల్‌గా ఉండండి: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లను వాడకుండా కఠిన నియమాలను పాటించాలని మీరు ఆశించే ముందు, మీరే ఒక రోల్ మోడల్ గా ఉండేందుకు ప్రయత్నించడం మేలు. పిల్లలు వారు విన్నదాని కంటే వారు చూసే దాని నుండి ఎక్కువ నేర్చుకుంటారు. పిల్లల ఎదురుగా గంటల కొద్ది స్మార్ట్ ఫోన్ వాడకుండా.. వీలైనంత తక్కువ సమయం వాడటం మంచిది. ఇలా చేయడం ద్వారా పిల్లల నుంచి స్మార్ట్ ఫోన్ వ్యవసనాన్ని దూరం చేయ్యొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..