
బట్టతల, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి శాస్త్రవేత్తలు అద్దిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. మీరు బట్టతల సమస్యతో బాధపడుతుంటే, మార్కెట్లోకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ని ప్రయత్నించిన తర్వాత నిరాశ చెందుతుంటే.. ఈ వార్త మీకో ఆశాకిరణం కావచ్చు. అవును.. ఎందుకంటే..ఇటీవల శాస్త్రవేత్తలు కేవలం 20 రోజుల్లో బట్టతలపై జుట్టు పెంచగలని అద్భుత సీరంను తయారు చేశారు. ఈ సీరం జుట్టు కుదుళ్లను మళ్లీ సజీవం చేసే విధంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇందుకు సంబంధంచి నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో వెల్లడించారు. దీనిని నేషనల్ తైవాన్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సీరం ఎలా పనిచేస్తుంది..? దాని ప్రత్యేకత ఏమిటి..? ఇది నిజంగా బట్టతలకి నివారణ కాగలదా..? అనే ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చూద్దాం..
శాస్త్రవేత్తల వివరణ మేరకు..పరిశోధనలో భాగంగా ఎలుకలపై ఈ సీరంను ప్రయోగించగా అది పని చేసిందని వివరించారు. ఈ సీరం అప్లై చేయటం వల్ల చర్మం క్రింద ఉండే కొవ్వు కణాలను ఉత్తేజపరిచి, జుట్టు కుదుళ్లను తిరిగి పెరిగేలా చేయడంలో విజయవంతమైందని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రక్రియ హైపర్ట్రైకోసిస్ అనే విధానంపై ఆధారపడి ఉందని వెల్లడించారు. దీని ప్రకారం చర్మానికి కలిగే చిన్నపాటి చికాకు, గాయంలాంటివి లేకుండా ఎక్కువగా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందని వెల్లడించారు. ఈ సీరంలో సహజ ఫ్యాటీ యాసిడ్లు ముఖ్యంగా ఓలిక్ యాసిడ్, పామిటోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి జుట్టు కుదుళ్ల మూల కణాలను ఉత్తేజపరచి, కొత్త వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి.
ప్రొఫెసర్ సంగ్-జాన్ లిన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సీరంను మొదట పరిశోధకులు తమ కాళ్లపై పరీక్షించగా, మూడు వారాల్లోనే జుట్టు తిరిగి పెరిగిందని తెలిపారు. ఈ ఫలితాలు మానవ చర్మానికి కూడా అన్వయిస్తాయని, త్వరలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ సీరంకు పేటెంట్ లభించింది. ఇక త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆవిష్కరణ జుట్టు రాలిపోవడం, బట్టతల సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారంగా మారే అవకాశముంది.
🧴 Baldness — over: scientists have created a serum that restores hair in just 20 days
Researchers in Taiwan tested a new formula on mice — and within three weeks, completely bald animals started growing fur again.
The secret lies in natural fatty acids that stimulate hair… pic.twitter.com/8Jj25wrmQG
— NEXTA (@nexta_tv) October 24, 2025
ఈ పరిశోధన ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికలలో ఒకటైన నేచర్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఈ సీరం జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా జుట్టును బలోపేతం చేస్తుందని శాస్త్రవేత్తలు నివేదించారు. ఇందులో స్టెరాయిడ్లు లేదా హానికరమైన రసాయనాలు లేవని చెప్పారు. దీనివల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రయోగం నిజంగానే బట్టతల వారికి గొప్ప భరోసా కానుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..