గ్యాస్‌ సిలిండర్‌ పేలకుండా ఉండాలంటే.. ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి.. పాటించాల్సిందే!

| Edited By: Ravi Kiran

Jul 14, 2023 | 6:11 AM

ప్రతి సిలిండర్ పై కచ్చితంగా ఒక ముద్ర వేసి ఉంటుంది.. ఉదాహరణకు..*C-23* C అంటే జులై, 23 అంటే ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం.. అలా కాకుండా జులై నెలలో A-23 అంటే జనవరి 23 అని ముద్రించిన సిలిండర్ డెలివరీ చేస్తే..

గ్యాస్‌ సిలిండర్‌ పేలకుండా ఉండాలంటే.. ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి.. పాటించాల్సిందే!
Lpg Safety Tips
Follow us on

ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ పేలుళ్లు, అగ్నిప్రమాదాలు తరచుగా చూస్తున్నాం. వివిధ కారణాలతో అగ్నిప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్ని ప్రమాదాల ఘటనలు నిత్యం వినిపించడం ఆందోళన కలిగిస్తుంది. గ్యాస్ పైప్ తరచుగా మార్చుకోకపోవడం, నిల్వచేసిన గ్యాస్ సిలిండర్లు వాడటం సిలిండర్ పేలడానికి కారణం అవుతున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలు, గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు నివారించవచ్చు ఇక్కడ తెలుసుకుందాం..

అవగాహన లోపం:

గ్యాస్ పైప్ ఎన్ని నెలలకోసారి మార్చాలి..? గ్యాస్ సిలిండర్ కాలపరిమితి ఎలా గుర్తించాలి…? తీసుకున్న గ్యాస్ సిలిండర్ ఎన్ని నెలల్లోపు వినియోగించాలి..? ఇలాంటి వాటిపై అవగాహన ఉంటే ప్రమాదాల నుండి వీలైనంత దూరంగా ఉండొచ్చు..

ఇవి కూడా చదవండి

గ్యాస్ సిలిండర్ ఎన్ని రోజుల్లోపు వినియోగించాలి..

గ్యాస్ సిలిండర్ ఎప్పటికప్పుడు వినియోగిస్తే నాణ్యమైన గ్యాస్ అందటంతో పాటు ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. కొనుగోలు చేసిన తర్వాత నెలల తరబడి వాడకుండా నిల్వ ఉంచడం మంచిది కాదు. అవసరాన్ని బట్టి గ్యాస్ బుక్ చేసుకుని వారం కంటే ఎక్కువ నిల్వ లేకుండా చూసుకోవాలి.

గ్యాస్ సిలిండర్ కాలపరిమితి ఎలా గుర్తించాలి..

ముందుగా గ్యాస్ సిలిండర్ కాలపరిమితి తెలుసుకోవాలి. కాల పరిమితి తెలుసుకోవాలంటే సిలిండర్ పై ముద్రించి ఉన్న అంకెలను, అక్షరాలను గమనించాలి. వాటిని సులభంగా గుర్తించడం ఎలా..?

సంవత్సరంలోని 12 నెలలను నాలుగు భాగాలుగా విభజించి, ప్రతి మూడు నెలలకు ఒక అక్షరం చొప్పున రాసి ఉంటుంది A,B,C,D అని. A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. B అంటే ఏప్రిల్, మే, జూన్. C అంటే జులై, ఆగస్టు, సెప్టెంబర్. D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్.

ప్రతి సిలిండర్ పై కచ్చితంగా ఒక ముద్ర వేసి ఉంటుంది.. ఉదాహరణకు..*C-23* C అంటే జులై, 23 అంటే ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం.. అలా కాకుండా జులై నెలలో A-23 అంటే జనవరి 23 అని ముద్రించిన సిలిండర్ డెలివరీ చేస్తే తీసుకోకుండా కాలపరిమితి ముగిసిందని తిరిగి పంపించేయాలి.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్ సిలిండర్ పేలుడ్లు, అగ్ని ప్రమాదాల నుండి దూరంగా ఉండొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..