
ఈ ఏడాది చలి అధికంగా ఉంది. రోజురోజుకూ తీవ్రత పెంచుకుంటూ పోతోంది. జనాలు గజగజ వణుకుతున్నారు. చాలా మంది జలుబు, దగ్గు, ప్లూ వంటి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో వీలైనంత వరకు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే పనులు చేయాలి. దళసరి దుస్తులు ధరించాలి. చలిగాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆహారం ఆరోగ్యాన్ని అధికంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అదనపు చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, వేయించిన ఆహారాలు, ఆల్కహాల్ వంటివి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఇన్ ఫ్లమేషన్ నకు కారణమవుతాయి. ఏ ఆహార పదార్థాలను తగ్గించాలి? ఎందుకు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
చక్కెర: మన ఆహారంలో చక్కెరను పరిమితం చేయాలి లేదా నివారించాలి. పండ్లు, కూరగాయలలో కనిపించే ఫ్రక్టోజ్ ఉన్నప్పటికీ, అదనంగా జోడించిన చక్కెరలను గణనీయమైన మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
ఆల్కహాల్: అధిక మొత్తంలో ఆల్కహాల్ తాగడం వల్ల మీ అవయవాలను దెబ్బతీసే, మీ శరీరం అంతటా మంటను కలిగించే విస్తృతమైన ఇన్ ఫ్లమేషన్ ఏర్పడవచ్చు.
ప్రాసెస్ చేసిన ఆహారం: ఫ్రైస్, చీజీ స్టిక్‌లు, బర్గర్‌లు, రోల్స్ వంటివి అధిక కొవ్వుతో పాటు కేలరీలు ఇచ్చే వేయించిన ఆహార పదార్థాలు. వీటి వల్ల శరీరం రోగాల బారిన పడుతుంది.
ఉప్పు: ఒక వ్యక్తికి ఇప్పటికే హైపర్‌టెన్షన్ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, వారు ఎక్కువ ఉప్పును తిన్నప్పుడు వారి ఇన్ ఫ్లమేషన్ సమస్య మరింత అధికమవుతుంది.
రెడ్ మీట్: రెడ్ మీట్ గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీయవచ్చు. ఇవన్నీ ఇన్ ఫ్లమేషన్ తో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి.
మీ ఆరోగ్యాన్ని వీలైనంత వరకు కాపాడుకోవడానికి ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ఆహారాలను నివారించడం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పోషకాలను తినడం మంచిది. సీజనల్ పండ్లు, ఆకు కూరలు వంటి సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీలుగా పనిచేసే ఆహారాలను తినడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..