Rice Water for Strong Hair: విద్య, ఉద్యోగం పేరుతో బిజీబిజీగా సాగుతున్న ప్రస్తుత జీవనశైలిలో జుట్టు సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ సమస్యల నుంచి కేశాలను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు లేక విసుగెత్తిపోయినవారు కూడా ఉన్నారు. అలాంటివారి కోసమే ఓ చక్కని, ఇంకా ఖర్చు లేని పరిష్కార మార్గం ఒకటి ఉంది. ఇదేదో కొత్తగా కనిపెట్టిన పరిష్కారం కాదు, నానాటి నుంచి మనుగడలో ఉన్నా అందరికీ తెలియని చిట్కా అంతే. ఇక అందుకోసం మీరు చేయాల్సిందల్లా బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా జాగ్రత్త చేసుకోవడం. ఎంటీ..? జుట్టు సమస్యల నివారణకు బియ్యం కడిగిన నీటికి సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా..? నమ్మశక్యం కాకపోయినా బియ్యం కడిగిన నీటిని జుట్టుకు అప్లై చేసి మృధువుగా మసాజ్ చేస్తే చాలు. అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.
బియ్యం కడిగిన నీటిలో విటమిన్ బి, విటమిన్ ఇ, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, యాంటీ యాక్సిడెంట్లు వంటి పలు రకాల పోషకాలు ఉంటాయి. వీటన్నింటినీ కలిగిన బియ్యం కడిగిన నీరు మీ జుట్టును దృఢంగా మార్చడమే కాకుండా మృదువుగా, మెరుస్తూ అందంగా మార్చగలవు. ఈ నేపథ్యంలో బియ్యం నీటి ప్రయోజనాలు, వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు రాలడం: జుట్టు రాలే సమస్య ఉన్నవారు తమ కేశాలకు బియ్యం కడిగిన నీళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాల కుదుళ్లు బలపడి రాలే సమస్య తగ్గుతుంది.
చుండ్రు: చుండ్రు సమస్య ఉన్నవారు కూడా బియ్యం కడిగిన నీటిని ఉపయోగించవచ్చు. చుండ్రు ఉన్న చోట ఈ నీటితో కడిగితే చాలు. అలా బియ్యం నీటితో కడిగి కనీసం గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత సాధారణ నీటితో తల శుభ్రం చేసుకోండి.
హెయిర్ డ్రైయింగ్: పొడిబారిపోయిన జుట్టుకు బియ్యం నీళ్లు ఉపయోగకరంగా ఉంటాయి. ఇందుకోసం మీరు బియ్యం కడిగిన నీటిని వెంట్రులకు అప్లై చేసి ఆరేవరకు ఆగాలి. తర్వాత తలస్నానం చేయండి.
జుట్టు మెరుపు: చిన్న వయసులోనే జుట్టు మెరవడం అనేది ప్రస్తుత కాలంలో పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి నివారణగా జుట్టును బియ్యం నీళ్లను అప్లై చేసి కనీసం 15 నిముషాలు ఉంచి తలను శుభ్రం చేసుకోండి.
గమనిక: ఈ ఆర్టికల్‌లో తెలియజేసిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. ఏవైనా చిట్కాలను అనుసరించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి