ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మన ఆహారంలో ప్రధాన భాగం అన్నమే ఉంటుంది. వరి అన్నంలో ఎక్కువ కార్భోహైడ్రేట్లు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఆహారం, జీవనశైలిలో కూడా ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కార్భోహైడ్రేట్ల పరిమాణాన్ని పరిశీలించుకోడం తప్పనిసరి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అన్నం తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. అధ్యయనాల ప్రకారం టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు అన్నం తక్కువగా తింటూ ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలను తింటే బెటర్. ప్రతి మధుమేహ రోగి రోజువారీ ఆహారంలో కార్భోహైడ్రేట్ల పరిమితిని నిర్ణయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తక్కువ అన్నంతో ఎక్కువ కూరను తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్రౌన్ రైస్, వైల్డ్ రైస్, లాంగ్ గ్రెయిన్ వైట్ రైస్ తీసుకోవడం ఉత్తమం. వీటిల్లో ఎక్కువ ఫైబర్, న్యూట్రియంట్లు, విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా బియ్నాన్ని ఉడికించి అన్నం అయిన తర్వాత మళ్లీ వేడి చేసుకుని తినడం ఉత్తమం. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా తక్కువ పిండి పదార్థాలను విచ్ఛినం చేయడానికి ఉపయోగపడుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులకు అన్నం వండే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలని నిపుణులు వెల్లడిస్తున్నారు. బాస్మతి లేదా బ్రౌన్ రైస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా బియ్యం వండే ముందు రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి ఓ గంటపాటు నానబెట్టాలి. అలాగే అన్నం ఉడుకుతున్న సమయంలో గ్యాస్ ఆఫ్ చేసి బియ్యాన్ని చల్లారనివ్వాలి. అనంతరం మళ్లీ వండాలి. ఈ ప్రక్రియ రెసిస్టెంట్ స్ట్రాచ్‌ను ఏర్పాటును పెంచుతుంది. ఇలా చేయడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా బాగా మేలు చేస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం కోసం అన్నంపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోల్డ్ అండ్ స్టీల్ కట్ వోట్స్, బార్లీ, గోధుమ, క్వినోవా, మిల్లెట్, బుక్‌వీట్ వంటి ఆహారాలను తీసుకుంటే మేలని పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి