క్యాన్సర్ వ్యాధిని తగ్గించే.. కొత్త చికిత్సలు..

క్యాన్సర్ రోగులకు శుభవార్త.. చివరి దశలో ఉండే క్యాన్సర్‌ వ్యాధికి కొత్త చికిత్సా పద్ధతిని కనుగొంది CART సంస్థ. అనేక రొమ్ము, ఊపిరి తిత్తులు, మోసోథెలియోమో వంటి క్యాన్సర్ రోగులకు చివరి దశలో చికిత్స అందించడం ద్వారా చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు చనిపోతున్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ద క్యాన్సర్ రీసెర్చ్‌లో భాగంగా.. మొదటి దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు ఈ చికిత్సను అందించడం ద్వారా క్యాన్సర్‌ను తగ్గించే ప్రయత్నం చేయవచ్చని తెలిపారు శాస్త్రవేత్తలు. రోగనిరోధక […]

క్యాన్సర్ వ్యాధిని తగ్గించే.. కొత్త చికిత్సలు..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 02, 2019 | 1:56 PM

క్యాన్సర్ రోగులకు శుభవార్త.. చివరి దశలో ఉండే క్యాన్సర్‌ వ్యాధికి కొత్త చికిత్సా పద్ధతిని కనుగొంది CART సంస్థ. అనేక రొమ్ము, ఊపిరి తిత్తులు, మోసోథెలియోమో వంటి క్యాన్సర్ రోగులకు చివరి దశలో చికిత్స అందించడం ద్వారా చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు చనిపోతున్నారు.

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ద క్యాన్సర్ రీసెర్చ్‌లో భాగంగా.. మొదటి దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు ఈ చికిత్సను అందించడం ద్వారా క్యాన్సర్‌ను తగ్గించే ప్రయత్నం చేయవచ్చని తెలిపారు శాస్త్రవేత్తలు. రోగనిరోధక తగ్గిన కణితుల యొక్క ప్రారంభ దశలోనే క్లినికల్ ట్రయల్ చేయడం ద్వారా 50 శాతం వరకూ మోసోథెలియోమో రోగుల రక్తంలో క్యాన్సర్‌ను తగ్గించవచ్చని పేర్కొన్నారు. కేవలం ఒక సిట్టింగులోనే రోగులలో మార్పు కనిపించిందని చెప్పారు శాస్త్రవేత్తలు.

ఈ విధానం ప్రపంచంలోనే మొదటిదిగా.. రచయిత స్లోన్ కెటర్జింగ్ థోరాసిక్ సర్జరీ డిప్యూటీ చీఫ్, డాక్టర్ ప్రసాద్ అడుసుమిల్లి ఒక ఇ-మెయిల్ ద్వారా తెలియజేశారు. క్యాన్సర్‌ను ఒక యుద్ధంగా.. డాక్టర్ ప్రసాద్ అడుసుమిల్లి ప్రకటించారు.

సాధారణంగా ప్యాంక్రియాటిక్ వంటి క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, రేడియేషన్ వంటి ప్రామాణిక చికిత్సలను అందిస్తారు. వాటి కూడా రోగులు స్పందించడం చాలా అరుదు. అయితే.. ఇమ్యునోథెరపీ రోగి అసమానతను మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ కొత్త చికిత్సలు క్యాన్సర్‌తో పోరాడే రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థను సూపర్ రీఛార్జ్ చేస్తాయన్నారు శాస్త్రవేత్తలు.

గత ఏడాదికి టెక్సాస్క్‌కు చెందిన డాక్టర్ జేమ్స్ అల్లిసన్, టీ కణాలు తన అధ్యయం కోసం నోబెల్ బహుమతిని ప్రదానం చేశాడు. ఇమ్యునోథెరపీ రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రజల జీవితాలను పొడిగించి, కణితులకు వ్యతిరేకంగా పోరాడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ రకమైన కొత్త చికిత్సా పద్ధతులు.. వివిధ రకాల రొమ్ము, ఊపిరితిత్తులు, అండాశయము, ప్యాంక్రియాటిక్, కడుపులో ఉండే క్యాన్సర్ల కణజాల ఉపరితలాలపై కవచం లాగా పనిచేసే మోసోథెలియోమో అనే ప్రోటీన్ ద్వారా గుర్తించబడతాయని పేర్కొన్నారు. వీటి ద్వారా క్యాన్సర్ రోగులు చక్కటి పరిష్కారాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.