Castor Oil for Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఆముదం నూనెను ఈ విధంగా ఉపయోగిస్తే సరి..

|

Dec 31, 2022 | 9:58 PM

అముదం నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఆముదంలో ఉండే పోషకాలు జుట్టు మూలాలకు పోషణనిచ్చి, చుండ్రును పోగొట్టి, జుట్టు దృఢంగా ఉండేలా..

Castor Oil for Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఆముదం నూనెను ఈ విధంగా ఉపయోగిస్తే సరి..
Castor Oil Benefits
Follow us on

చలికాలం అంటేనే అనేక ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా చర్మం, జుట్టు అనేక సమస్యలను ఎదుర్కొంటాయి. ఇక చర్మం వాడిపోవడం, జుట్టులో చుండ్రు విపరీతంగా పెరగడం శరామాములు సమస్యలే. అలాగే ఈ రోజుల్లో జుట్టు పొడిబారిపోయి డ్రైగా మారుతుంది. ఇలాంటి సమస్యలను తెలివిగా పరిష్కరించుకునేందుకు, ఆరోగ్యవంతమైన జుట్టు కోసం చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నాయనమ్మలు మన తలకు ఆముదం నూనె రాసేవారు. ఎటువంటి జుట్టు లేదా చర్మపు సమస్యలు లేని ఆ రోజులను ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పటికీ ఆముదం నూనె ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అముదం నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఆముదంలో ఉండే పోషకాలు జుట్టు మూలాలకు పోషణనిచ్చి, చుండ్రును పోగొట్టి, జుట్టు దృఢంగా ఉండేలా చేస్తాయి. ఆముదం నూనెను జుట్టుకు అనేక రకాలుగా అప్లై చేయవచ్చు. అలా ఏయే పద్దతులలో ఆముదం నూనెను ఉపయోగించవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వేప ఆకులతో ఆముదం నూనె: ఆముదం, వేప ఆకులను కలిపి రాసుకుంటే చుండ్రు తక్షణమే తొలగిపోతుంది. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఆముదంలో ఉండే గుణాలు చర్మాన్ని తేమగా మారుస్తాయి. ఆవనూనెతో వేప ఆకుల పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టుకు మెరుపు వస్తుంది.
  2. కలబందతో ఆముదం నూనె: కలబంద, ఆముదం కలిపి రాసుకుంటే చుండ్రు త్వరగా పోతుంది. ఇందుకోసం అలోవెరా జెల్‌లో 2 టీస్పూన్ల ఆముదం మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత బాగా కడగాలి. కొన్ని రోజుల పాటు ఈ పద్ధతిని అనుసరిస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. హెన్నాతో ఆముదం నూనె: హెన్నాతో ఆముదం నూనెను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చుండ్రు పోవడమే కాకుండా జుట్టు నల్లగా మారుతుంది. హెన్నాలో ఒక చెంచా ఆముదం మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. 1 గంట తర్వాత కడిగేస్తే జుట్టు అందంగా కనిపిస్తుంది.
  5. కొబ్బరి నూనెతో ఆముదం నూనె:కొబ్బరిలో ఆముదం కలిపి రాసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇంకా తల అంతా చల్లగా ఉంటుంది. ఈ  రెండు నూనెల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోతుంది. అంతేకాక జుట్టు రాలడం ఆగిపోయి, కొత్త మెరుపు వస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..