Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుందా..? అయితే.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇక పుల్‌స్టాప్‌ పెట్టేయండి..

|

Jan 21, 2023 | 9:20 PM

చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు అనేది చల్లటి వాతావరణం కారణంగా తల చర్మం పొడిగా మారి ఈ సమస్యకు కారణమవుతుంది.

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుందా..? అయితే.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇక పుల్‌స్టాప్‌ పెట్టేయండి..
Dandruff
Follow us on

చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు అనేది చల్లటి వాతావరణం కారణంగా తల చర్మం పొడిగా మారి ఈ సమస్యకు కారణమవుతుంది. ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అయితే, చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు.. పలు చిట్కాలతో చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో మూడు సింపుల్ హోం రెమెడీస్ తో మీ చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు నిపుణులు. ఈ చిట్కాలు తలకు తేమను అందిస్తాయని పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అవేంటో చూద్దాం..

చుండ్రుకు హోం రెమెడిస్..

  1. వేప రసం: వేప జుట్టు పెరుగుదలను మెరుగుపరిచడంతోపాటు స్కాల్ప్ మీద మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వేప రసంలోని లక్షణాలు చుండ్రు చికిత్సలో ప్రభావవంతంగా ఉంటాయి. వేప ఆకులను పేస్టులా చేసి తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
  2. పెరుగు – ఉసిరి పొడి: ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చుండ్రును నియంత్రించడంలో మంచిగా పనిచేస్తుంది. మరోవైపు, మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి పెరుగులో 2 చెంచాల ఉసిరిపొడిని కలిపి తలకు పట్టించాలి.
  3. ఒత్తిడి నుంచి ఉపశమనం: ఒత్తిడి మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. చుండ్రుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వీలైనంత వరకు యోగా, ఎక్సర్‌సైజ్‌, నడక లాంటివి అలవర్చుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..