సంబంధాలు చాలా సున్నితమైనవి. ఏదైనా సంబంధాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం అందంగా సాగిపోవాలంటే.. నీతి నిజాయతీగా సాగిపోవాలి. అయితే కొన్నిసార్లు జీవిత భాగస్వామి మరొక వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. అప్పుడు జీవిత భాగస్వామి వైఖరి, ప్రవర్తన కారణంగా సంబంధం నాశనం అవుతుంది. అప్పుడు దంపతుల మధ్య వివాదాలు మొదలవుతాయి. భార్యాభర్తల బంధం తెగిపోవడానికి ఇదే ప్రధాన కారణం. కనుక వైవాహిక జీవితంలో తమ భాగస్వామి తమని మోసం చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలంటే.. కొని టిప్స్ ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామిలో కొన్ని రకాల మార్పులు వస్తుంటే అప్పుడు ఆలోచనాలో పడాల్సిందే.. కనుక ఆ వ్యక్తిలో ఈ మార్పులు ఉన్నాయో లేదో చెక్ చేయండి..
వ్యక్తిగత దూరాన్ని పాటిస్తుంటే: ఈ మార్పు వస్తుంటే మోసం చేసిన లేదా మోసం చేస్తున్న జీవిత భాగస్వామి ప్రవర్తనలో ప్రధాన అంశం. తమ జీవిత భాగస్వామితో అప్పటి వరకూ ఎక్కువ సమయం గడిపే వ్యక్తి.. అకస్మాత్తుగా దూరం పెట్టడం మొదలు పెడతాడు. జీవిత భాగస్వామితో మాట్లాడటానికి అయిష్టతను వ్యక్తం చేస్తూ ఉంటాడు. భార్యాభర్తలు మాట్లాడుకోవడం తగ్గి పోట్లాడుకోవడం ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న విషయాలకు కోపం, కేకలు వేయడం వంటి ప్రవర్తన కనిపిస్తుంటే జీవిత భాగస్వామి తో సంబంధం ఇష్టం లేదని అర్ధమట.
ఆలోచనలను దాచిపెట్టే ప్రయత్నాలు : వైవాహిక జీవితంలో ఎలాంటి దాపరికం లేని వ్యక్తి.. నిజాయితీపరుడిగా ఉండే వ్యక్తిలో హటాత్తుగా మార్పు వస్తే.. అంటే తన భార్యతో అప్పటి వరకూ అన్ని విషయాలు చెప్పే వ్యక్తీ.. హటాత్తుగా దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంటే… అంటే సోషల్ మీడియాలో తనకు వచ్చిన మెసేజ్ లు డిలీట్ చేయడం. తరచుగా ఫోన్ కాల్స్ చేయడం.. ఫోన్ కాల్స్ లిస్టు ని డిలీట్ చేయడం వంటివి భర్తలో నిజాయతీ లోపిస్తుందని అర్ధం. ఫోన్‌లో పాస్‌వర్డ్ , లాక్‌లు పెట్టడం అంటే జీవిత భాగస్వామి నుంచి ఏదో దాస్తున్నాడని అర్థం.
ఎప్పుడూ ఫోన్ లేదా టెక్స్ట్‌లో మునిగిపోతే : వైవాహిక జీవితంలో ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ.. సాన్నిహిత్యం ఉండదు. జీవిత భాగస్వామి ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతుంతే.. ఏ చిన్న శబ్దం వచ్చినా ఫోన్ వైపు చూస్తే అతను మరొక వ్యక్తితో సాంగత్యాన్ని పెంచుకున్నాడని అర్ధం. అంతే కాకుండా తన ఫోన్ ని భాగస్వామి తాకితే కోపం రావడం, పాస్‌వర్డ్ అడిగితే సబ్జెక్ట్‌ని
డైవర్ట్ చేయడం వంటి లక్షణలు కనిపిస్తే దాంపత్య జీవితం తప్పు దారిలో పడుతోందని అనుమానించాల్సి ఉంటుంది.
శారీరక సాన్నిహిత్యం లేకపోవడం : మీరు మీ భాగస్వామితో ప్రేమతో మాట్లాడటానికి దగ్గరకు వెళ్తే.. మీరు మాటలపై ఆసక్తి చూపించిక పోయినా.. మీరు దగ్గరవుతున్నప్పటికీ మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంటే.. అప్పుడు మీ భర్త ప్రవర్తనపై దృష్టి పెట్టండి. భార్య ఏ చిన్న పని చేసినా.. చిరాకు పడుతుంటే.. భౌతిక దూరం పాటిస్తే అప్పుడు సంబంధంలో నిజాయితీ లోపించింది అని గ్రహించండి. వీలైతే ఇద్దరూ కూర్చొని ఈ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడుకుని రిలేషన్ షిప్ కుదుర్చుకుంటే బాగుంటుంది. లేదంటే భార్య భర్తల మధ్య బంధం బీటలు వారి విడిపోయే ప్రమాదం కూడా ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)