Door Sounding: వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..

|

Jul 16, 2024 | 3:14 PM

వర్షా కాలం వచ్చిందంటే చాలు.. తలుపు, కిటికీలు చప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకొందరికి అయితే డోర్లు కూడా పట్టవు. సాధారణంగా అందరూ ఎదుర్కునే సమస్యల్లో ఇది కూడా ఒకటి. వర్షా కాలంలో గాలిలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ కారణంగా కిటికీలు, తలుపులు పట్టవు. అంతేకాకుండా కిర్రు కిర్రు.. మంటూ చప్పుడు వస్తుంది. ఎంత గట్టిగా బిగించినా కూడా ఒక్కోసారి డోర్లు అనేవి పట్టవు. వీటిని మూయడానికి నానా ఇబ్బందులు..

Door Sounding: వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
Door Sounding
Follow us on

వర్షా కాలం వచ్చిందంటే చాలు.. తలుపు, కిటికీలు చప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకొందరికి అయితే డోర్లు కూడా పట్టవు. సాధారణంగా అందరూ ఎదుర్కునే సమస్యల్లో ఇది కూడా ఒకటి. వర్షా కాలంలో గాలిలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ కారణంగా కిటికీలు, తలుపులు పట్టవు. అంతేకాకుండా కిర్రు కిర్రు.. మంటూ చప్పుడు వస్తుంది. ఎంత గట్టిగా బిగించినా కూడా ఒక్కోసారి డోర్లు అనేవి పట్టవు. వీటిని మూయడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తలుపులకు ఉండే గొల్లాలు, గొలుసులు కూడా పట్టవు. ఈ సమస్యలు కూడా మీ ఇంట్లో ఉంటే.. ఇప్పుడు చెప్పే సింపుల్ చిట్కాలు ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

హెయిర్ డ్రయ్యర్స్:

జుట్టును ఆరబెట్టుకోవడానికి హెయిర్ డయ్యర్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. వీటితో వర్షా కాలంలో జుట్టును త్వరగా ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది హెయిర్ డయ్యర్స్ వాడుతున్నారు. వీటితో మీ తలుపు, కిటికీల సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఒకసారి కిటికీలు, తలుపులను చెక్ చేయండి. ఎక్కడైతే ఎక్కువగా తేమ కనిపిస్తుందో అక్కడ హెయిర్ డ్రయ్యర్‌తో ఆరబెట్టండి. వేడి గాలి వల్ల ఇవి త్వరగా సెట్ అయిపోతాయి.

ఉబ్బకుండా:

వర్షం వల్ల తలుపులు ఉబ్బి పోకుండా ముందుగానే అన్ని డోర్స్‌కి ఆయిల్ లేదా పారాఫిన్ వ్యాక్స్ పత వేయాలి. దీని వల్ల తలుపు ఉబ్బకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

తలుపులను ఇలా శుభ్రం చేయండి:

అప్పుడప్పుడూ తలుపులను శుభ్రం చేస్తూ ఉంటారు. అయితే వర్షా కాలంలో తడి గుడ్డతో తలుపులను తుడవ కూడదు. దీని బదులు తలుపు మీద కొద్దిగా ఆయిల్ వేసి దానితో తలుపు తుడిస్తే.. మెరుపు రావడంతో పాటు తేల పీల్చుకోకుండా ఉంటుంది.

తేమ చేరకుండా ఇలా చేయండి:

వర్షా కాలంలో తలుపులకు ఖచ్చితంగా తేమ చేరుతుంది. కాబట్టి ముందుగానే తలుపులకు నూనె రాయడం లేదా పెయింట్ వేయడం వల్ల తేమ పీల్చుకోకుండా ఉంటుంది.

ఆయిల్ ఉపయోగించండి:

తేమ ఎక్కువగా ఉండటం వల్ల తలుపులు, కిటికీల నుంచి కిర్రు.. కిర్రు మంటూ సౌండ్ వస్తుంది. కాబట్టి ఆవనూనె లేదా కొబ్బరి నూనెతో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే సౌండ్ వస్తుందో అక్కడ ఆయిల్ వేయండి. అదే విధంగా ఎక్కడైతే గొల్లాలు పట్టడం లేదో అక్కడ కూడా నూనె వేయడం వల్ల ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..