బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే నెలలోనే పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది.. ట్రై చేయండి..

|

May 30, 2023 | 8:29 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా పొట్టపై అధిక కొవ్వు (బెల్లీ ఫ్యాట్) ఉండటం వల్ల చాలా మంది ఆపసోపాలు పడుతుంటారు. అయితే, స్థూలకాయం మిమ్మల్ని అనేక వ్యాధులకు గురి చేస్తుంది.

బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే నెలలోనే పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది.. ట్రై చేయండి..
Weight Loss tips
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా పొట్టపై అధిక కొవ్వు (బెల్లీ ఫ్యాట్) ఉండటం వల్ల చాలా మంది ఆపసోపాలు పడుతుంటారు. అయితే, స్థూలకాయం మిమ్మల్ని అనేక వ్యాధులకు గురి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గించుకోవచ్చు. గంటల తరబడి చెమటలు పట్టిస్తూ.. కొన్ని సులభమైన మార్గాల్లో బరువును తగ్గించుకోవచ్చు.. అది ఎలాగో తెలుసుకోండి..

ఈ మార్గాల్లో పొట్టను కొవ్వును తగ్గించుకోండి..

డ్యాన్స్ చేయడం ద్వారా పొట్టను తగ్గించుకోండి: బెల్లీ ఫ్యాట్ అనేది ప్రజలను చాలా ఇబ్బంది పెట్టే సమస్య.. మీ నడుము చుట్టూ నిల్వ ఉండే కొవ్వును బెల్లీ ఫ్యాట్ అంటారు. పెరిగిన బెల్లీ ఫ్యాట్ వల్ల మీరు కొలెస్ట్రాల్, హై బీపీ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. పొట్టతో మీరు ఇబ్బంది పడుతుంటే రోజూ ఒక గంట సేపు డ్యాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ శరీరం మొత్తం వ్యాయామం అవుతుంది. కొద్ది రోజుల్లోనే పొట్ట లోపలికి వెళ్తుంది.

రోజూ సైక్లింగ్ చేయండి: జిమ్‌కి వెళ్లకుండానే పొట్ట తగ్గాలంటే సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ బెల్లీ ఫ్యాట్ కొద్దిరోజుల్లో వెన్నలా కరిగిపోతుంది. దీన్ని చేయడానికి మీరు ఎప్పుడైనా ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రోజూ క్రంచెస్ చేయండి: బొడ్డు కొవ్వును తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం క్రంచెస్. మేము బెల్లీ ఫ్యాట్ తగ్గించడం గురించి మాట్లాడేటప్పుడు.. క్రంచెస్ వ్యాయామం అగ్రస్థానంలో ఉంటుంది. అందుకే ఈ వ్యాయామం ప్రతిరోజూ చేయాలంటున్నారు నిపుణులు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం..