వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్యం అందరినీ ఇబ్బందిపెడతుంది. వృద్ధాప్యం రాకముందే మన ముఖం లేదా శరీరంలో వచ్చే వృద్ధాప్య ఛాయలు చాలా ప్రాబ్లెమ్స్ కు గురి చేస్తుంది. అందరి వద్దకూ వెళ్లి మాట్లాడడానికి కూడా ఇన్ సెక్యూర్ ఫీలింగ్స్ కు కారణమవుతుంది. మన ముందు బాగానే ఉన్నా మనం వెళ్లాక మన గురించి ఏమనుకుంటున్నారో? అని మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. అయితే వృద్ధాప్యాన్ని ఆపలేకపోవచ్చు కానీ మంచి పౌష్టికాహారం తింటే మాత్రం వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉంటాయని నిపుణుల వాదన. అంటే కొన్ని రకాల ఆహారాల్లో ఉండే గుణాల వల్ల వృద్ధాప్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నిపుణులు సూచించే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల చర్మ రక్షణకు నిపుణులు మంచిదని సూచిస్తున్నారు. అలాగే బొప్పాయిలో లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని, వీటి వల్ల వృద్ధాప్య సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
దానిమ్మ లో ఉండే ప్యూనికాలజిన్స్ అనే సమ్మేళనం ఉంది. ఇది చర్మానికి అవసరమయ్యే కొల్లాజిన్ ను సంరక్షిస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు కనిపించవు
ఆకు కూరల్లో ఉండే క్లోరోఫిల్ చర్మంలోని కొల్లాజిన్ ను పెంచుతుంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఆకు కూరలు తీసుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
పెరుగు ప్రో బయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది పేగులకు అవసరమయ్యే మంచి బ్యాక్టిరియాను పెంపొందిస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంలోని రంధ్రాలను కుదించడంతో పాటు బిగుతు చేయడం వల్ల ఫైన్ లైన్ లను తగ్గించడంలో సాయం చేస్తుంది. పెరుగులో విటమిన్ బీ 12 వల్ల కణాల పునరుత్పత్తి, పెరుగుదలకు సాయం చేయడం వల్ల చర్మం ఎప్పడు మెరుస్తూ, హైడ్రేటెడ్ గా ఉంటుంది.
టమాటాల్లో లైకోపీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం సూర్యరస్మితో పోరాడటానికి బాగా సాయం చేస్తుంది. చర్మానికి అవసరమయ్యే కొల్లాజిన్ ను ఉత్పత్తి చేయడానికి విటమిన్ సీ టమాటాల్లో ఎక్కువగా లభిస్తుంది.
గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో ప్రీరాడికల్స్ తో పోరాటం చేయడానికి సహకరిస్తుంది. అలాగే చర్మం సహజత్వాన్ని కోల్పోకుండా సాయం చేస్తుంది.
ఈ మధ్య కాలంలో వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేస్తున్న ఆహారం బ్రొకోలీ. ఇందులో విటమిన్ సీ, విటమిన్ కే వంటి అధికంగా ఉన్నాయి. అలాగే ఫొలెట్, కాల్షియం, లుటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల బ్రొకోలీని తరచూ తీసుకుంటే వృద్ధాప్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి