Red Apple vs Green Apple: రెడ్ యాపిల్ vs గ్రీన్ యాపిల్ వీటిల్లో ఏది తింటే మంచిది..

|

Oct 11, 2024 | 8:25 PM

ప్రతి రోజూ ఒక యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చని అంటూ ఉంటారు. యాపిల్‌‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. యాపిల్ తినేవారి ఆరోగ్యం ఇతరుల కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. యాపిల్ పండు చాలా రకాలుగా మేలు చేస్తుంది. అందం, ఆరోగ్యాన్ని పెంచడంలో యాపిల్ చక్కగా పని చేస్తుంది. చర్మం, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అయితే మార్కెట్లో రెండు రకాల యాపిల్స్..

Red Apple vs Green Apple: రెడ్ యాపిల్ vs గ్రీన్ యాపిల్ వీటిల్లో ఏది తింటే మంచిది..
Red Apple Vs Green Apple
Follow us on

ప్రతి రోజూ ఒక యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చని అంటూ ఉంటారు. యాపిల్‌‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. యాపిల్ తినేవారి ఆరోగ్యం ఇతరుల కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. యాపిల్ పండు చాలా రకాలుగా మేలు చేస్తుంది. అందం, ఆరోగ్యాన్ని పెంచడంలో యాపిల్ చక్కగా పని చేస్తుంది. చర్మం, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అయితే మార్కెట్లో రెండు రకాల యాపిల్స్ మనకు లభిస్తాయి. రెడ్ యాపిల్ ఒకటి.. గ్రీన్ యాపిల్ మరొకటి. కానీ ఈ రెండింటిలో ఏది తింటే మంచిది? ఏది ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. చాలా మందిలో ఆలోచన వస్తుంది. మరి వీటిల్లో ఏది తింటే శరీరానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ యాపిల్:

గ్రీన్ యాపిల్ తినేవారు కూడా చాలా మంది ఉన్నారు. గ్రీన్ యాపిల్‌లో ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లు లభిస్తాయి. అలాగే ఫైబర్, ఐరన్, పొటాషియం, ప్రోటీన్లు రెడ్ యాపిల్ కంటే ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ యాపిల్ తినడం వల్ల షుగర్ లేవెల్స్, రక్త పోటు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే వారు కూడా గ్రీన్ యాపిల్ తినడం వల్ల చాలా మంచిది. గ్రీన్ యాపిల్ తిడనం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారని పలు అధ్యయానలు చెబుతున్నాయి.

రెడ్ యాపిల్:

మార్కెట్లో ఎక్కువగా లభించేంది రెడ్ యాపిల్. గ్రీన్ యాపిల్ కంటే రెడ్ యాపిలే అధికంగా తీసుకుంటారు. రెడ్ యాపిల్‌లో కూడా ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే రెడ్ యాపిల్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అయితే ఈ యాపిల్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధితో ఉన్నవారు మితంగా తీసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో కూడా రెడ్ యాపిల్ ఎంతో సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఏది బెటర్..

రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ యాపిల్‌లో ఉండే పోషకాలు అందులో లభిస్తాయి. మీకు ఉన్న సమస్యలను బట్టి వైద్యుల సలహా తీసుకుని మీరు యాపిల్స్ ఎంచుకోవడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..