Lifestyle: భార్యకు ఆ సమస్య ఉంటే.. భర్తకు కూడా తప్పదు. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

|

Sep 15, 2024 | 3:44 PM

జీవిత భాగస్వామిలో ఒకరికి అధికరక్తపోటు ఉంటే అది మరొకరి కూడా తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంటే భార్య బీపీతో బాధపడుతుంటే భర్తకు కూడా ఆ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణంగా పరిశోధులు కొన్ని విషయాలు చెబుతున్నారు. చాలామంది దంపతులు ఒకేరకమైన ఆసక్తులు, జీవించే వాతావరణం...

Lifestyle: భార్యకు ఆ సమస్య ఉంటే.. భర్తకు కూడా తప్పదు. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Couple
Follow us on

సాధారణంగా వ్యాధులు వంశపారపర్యంగా వస్తాయని మనందరికీ తెలిసిందే. కుటుంబంలో పెద్దలు బీపీ, షుగర్‌ వ్యాధులతో బాధపడుతుంటే అది వారి సంతానంలో కూడా కనినిపించే అవకాశాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే కేవలం సంతానంలో మాత్రమే కాకుండా జీవిత భాగస్వాముల్లో కూడా ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

జీవిత భాగస్వామిలో ఒకరికి అధికరక్తపోటు ఉంటే అది మరొకరి కూడా తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంటే భార్య బీపీతో బాధపడుతుంటే భర్తకు కూడా ఆ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణంగా పరిశోధులు కొన్ని విషయాలు చెబుతున్నారు. చాలామంది దంపతులు ఒకేరకమైన ఆసక్తులు, జీవించే వాతావరణం, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులను కలిగి ఉండడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు.

అట్లాంటాలో ఎమరీ గ్లోబల్‌ డయాబెటిస్‌ రీసెర్చి సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేసే జితిన్‌ సామ్‌ వర్గీస్‌ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇందులో భాగంగా పరిశోధకులు అమెరికా, ఇంగ్లండ్‌, చైనా, భారతదేశాలకు చెందిన వేలాది దంపతుల నుంచి ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు. అనంతరం ఆ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చారు. భార్య, భర్తల జీవన విధానం ఒకేలా ఉండడమే దీనికి కారణమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివరాలను ‘జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌’లో ప్రచురించారు.

ఇక ఒత్తిడి అధికంగా ఉండే వారిలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో ఇబ్బందిపడేవారు ఏదైనా తింటే అంతగా రుచించదట. దీంతో మన నాలుక సంతృప్తి చెందేవరకు ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతుందట. ఊబకాయం పెరగడానికి ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ వివరాలను ‘ఫిజియాలజీ అండ్‌ బిహేవియర్‌’ జర్నల్‌లో ప్రచరించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..