AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది పండు కాదు అమృతఫలం..! ఇలాంటి వ్యాధులను తరిమికొట్టే రామబాణం..!!

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్జూజా పండులో సమృద్ధిగా ఉన్నాయి.. అధికశాతం నీరు ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. ఖర్జూజాలో మాంసకృత్తులు, పీచు, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు మరికొన్ని పోషకాలు ఉన్నాయి.

Jyothi Gadda
|

Updated on: Sep 15, 2024 | 3:11 PM

Share
జ్వరంతో బాధపడతున్నవారు ఖర్జూజా రసంలో తేనె కలిపి తీసుకుంటే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ ఖర్జూజా తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది.
మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి ఖర్జూజా ఔషధంగా పనిచేస్తుంది.

జ్వరంతో బాధపడతున్నవారు ఖర్జూజా రసంలో తేనె కలిపి తీసుకుంటే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ ఖర్జూజా తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి ఖర్జూజా ఔషధంగా పనిచేస్తుంది.

1 / 5
ఖర్జూజాను తీసుకోవటం వల్ల వయస్సు మీదపడినట్లు కనిపించకుండా చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా మార్చటంలో బాగా ఉపకరిస్తుంది. ఖర్జూజాలోని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది. శరీరంలోని వ్యర్ధాలు తేలికగా బయటకు పంపటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

2 / 5
ఖర్జూజాలో ఉండే బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఎ,సి విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా తోడ్పడతాయి. కంటి చూపును మెరుగు పరచటంలో ఖర్జూజా తోడ్పడుతుంది. ఖర్బూజ  జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.

3 / 5
ఖర్జూజా జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది.

4 / 5
ఖర్జూజాలో అధిక మోతాదులో పొటాషియం ఉండడం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.

5 / 5