
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అందరిపై ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు రీల్స్ లాంటి షార్ట్ వీడియోలపై ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. రోజుకి గంటల కొద్దీ వాటిని చూస్తున్నారు. ఇది నెమ్మదిగా ఒక రకమైన వ్యసనంగా మారుతోంది. అలాంటి పరిస్థితిలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరుగుతుంది.
పిల్లలు సహజంగానే పొగడ్తలు, గుర్తింపు కోరుకుంటారు. సుమారు 10 ఏళ్లకే వాళ్లు పక్కన వాళ్లు తమని యాక్సెప్ట్ చేయాలని చూస్తారు. ఈ టైంలో అమ్మానాన్నల నుంచి సరైన అటెన్షన్, ఆమోదం దొరక్కపోతే ఆ లోటును సోషల్ మీడియాలో వెతుక్కుంటారు. రీల్స్ చూస్తూ హ్యాపీ అవుతూ తమ వాల్యూను అక్కడే చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్లలో కాన్ఫిడెన్స్ తగ్గి.. టెన్షన్, బయటి ప్రపంచం పట్ల ఇంట్రెస్ట్ తగ్గడం పెరుగుతాయి.
పిల్లలు రీల్స్ తోనే ఎక్కువ టైం గడిపితే.. దాని ఎఫెక్ట్ వాళ్ల మెదడు పనితీరు మీద పడుతుంది. అవసరం లేని విషయాలన్నీ మెదడులో చేరి ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. ఎక్కువసేపు స్క్రీన్లు చూస్తే కళ్ల సమస్యలు, మెదడు అలిసిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
అంతేకాదు టెన్షన్, యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. ఇంకో పెద్ద ఇష్యూ ఏంటంటే ఊబకాయం (లావు అవడం). ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే బరువు పెరిగిపోవడం, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.
పిల్లల లైఫ్ ని రీల్స్ లో కాకుండా రియల్ లైఫ్ లో బ్యూటిఫుల్ గా మార్చాలంటే తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం. మీరు వాళ్లలో కాన్ఫిడెన్స్ నింపితే.. వాళ్లు మళ్లీ మన ప్రపంచంలోకి వస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..