మాంసాహారం లేనిదే ముద్ద దిగదా.. ఈ సీజన్‌లో పొరపాటున కూడా ఈ ఆహారాన్ని తినొద్దు..

|

Jul 04, 2024 | 10:04 AM

చినుకులు కురుస్తున్న సమయంలో వానని ఎంజాయ్ చేస్తూ ఏదైనా తినాలనే కోరిక కూడా పెరుగుతుంది, అలాంటి పరిస్థితుల్లో నోటికి కారంగా ఉండే ఆహారాన్ని తినాలనే ఆలోచన చాలా మందికి వస్తుంది. అయితే చాలా సార్లు రుచి పేరుతో ఆరోగ్యం విషయంలో రాజీ పడుతుంటారు. అయినప్పటికీ ఈ సీజన్‌లో మాంసం, జంతు ఆధారిత ఉత్పత్తులతో కూడిన కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటికి ఎందుకు దూరంగా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం..

మాంసాహారం లేనిదే ముద్ద దిగదా.. ఈ సీజన్‌లో పొరపాటున కూడా ఈ ఆహారాన్ని తినొద్దు..
Monsoon Sesaon Diet
Follow us on

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామందికి కారం తినాలనిపిస్తుంది. ఒకవైపు శాఖాహారులు టీతో పాటు పకోడీలు, బజ్జీలు వంటివి తింటే.. మరోవైపు మాంసాహారాన్ని ఇష్టపడే వారు వర్షాకాలంలో నాన్ వెజ్ వంటకాలను తినడం ఇష్టపడతారు. అయితే ఈ సీజన్ లో మనం కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. అందులో నాన్ వెజ్ ఫుడ్ ఒకటి అని నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌లు, వాటి వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సీజన్‌లో నాన్‌వెజ్‌ ఫుడ్‌ను ఇష్టపడే వారు సైతం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

చినుకులు కురుస్తున్న సమయంలో వానని ఎంజాయ్ చేస్తూ ఏదైనా తినాలనే కోరిక కూడా పెరుగుతుంది, అలాంటి పరిస్థితుల్లో నోటికి కారంగా ఉండే ఆహారాన్ని తినాలనే ఆలోచన చాలా మందికి వస్తుంది. అయితే చాలా సార్లు రుచి పేరుతో ఆరోగ్యం విషయంలో రాజీ పడుతుంటారు. అయినప్పటికీ ఈ సీజన్‌లో మాంసం, జంతు ఆధారిత ఉత్పత్తులతో కూడిన కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటికి ఎందుకు దూరంగా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం..

గుడ్లు: సాల్మోనెల్లా బ్యాక్టీరియా గుడ్లలో కనిపిస్తుంది. ఈ సీజన్‌లో బ్యాక్టీరియా నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కనుక ఈ సీజన్ లో గుడ్లు తినకుండా ఉండాలి. అంతేకాదు ఈ సీజన్‌లో గుడ్లను సరిగ్గా నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడవుతాయి. ఈ బాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే తక్కువగా ఉడికిన లేదా పచ్చి గుడ్లు తినవద్దు. దీనితో పాటు ఈ సీజన్‌లో మీరు పచ్చి గుడ్లతో చేసిన మయోనైస్‌కు కూడా దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

రెడ్ మీట్: వర్షాకాలంలో రెడ్ మీట్ అంటే గొర్రె, గొడ్డు మాంసం, పంది మాంసం వంటి వాటిని తినకూడదు. ఈ సీజన్‌లో వాతావరణంలో చాలా తేమ ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల వర్షాకాలంలో రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి.

సీ ఫుడ్: మాంసాహారంలో సీ ఫుడ్ ప్రియులు వేరు. ముఖ్యంగా రొయ్యలు, నత్తలు, వంటి వినియోగాన్ని వర్షాకాలంలో తగ్గించాలి. ఎందుకంటే వీటి గుల్లల్లో కలుషితమైన నీటిలోని బ్యాక్టీరియా, టాక్సిన్‌లను కూడబెట్టుకుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా బారిన సీ ఫుడ్ పడుతుంది. కనుక కలుషితమైన సీఫుడ్ తినడం వలన జీర్ణశయాంతర వ్యాధులతో సహా వివిధ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనితో పాటు ప్రాసెస్ చేసిన మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)