Premature Puberty: మీ పిల్లలు చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారా? అయితే వారు ఈ సమస్యతో బాధపడుతున్నట్లే..!

ముఖ్యంగా బాలికల్లో అకాల యుక్త వయస్సు లక్షణాలను అధికంగా గమనిస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిల్లో యుక్త వయస్సు 9 నుంచి 12 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. అయితే అబ్బాయిల్లో తొమ్మిదేళ్లు కంటే ముందే, అలాగే అమ్మాయిల్లో ఎనిమిదేళ్ల కంటే ముందే యుక్త వయస్సు లక్షణాలను గమనిస్తే అకాల యుక్త వయస్సుగా పరిగణిస్తారు. 

Premature Puberty: మీ పిల్లలు చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారా? అయితే వారు ఈ సమస్యతో బాధపడుతున్నట్లే..!
Girls

Edited By: Anil kumar poka

Updated on: Jan 12, 2023 | 6:04 PM

కోవిడ్ -19 మన జీవితాలను చాలా ప్రభావితం చేసింది. ఎలాంటి ఆరోగ్య నియమాలను పట్టించుకోని ప్రజలు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోడానికి ఆహార అలవాట్లపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా కరోనా సమయంలో లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండడం, అలాగే పిల్లలకు స్కూల్స్ లేక ఇంట్లోనే ఉండి ఎక్కువగా తినడం వల్ల కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా బాలికల్లో అకాల యుక్త వయస్సు లక్షణాలను అధికంగా గమనిస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిల్లో యుక్త వయస్సు 9 నుంచి 12 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. అయితే అబ్బాయిల్లో తొమ్మిదేళ్లు కంటే ముందే, అలాగే అమ్మాయిల్లో ఎనిమిదేళ్ల కంటే ముందే యుక్త వయస్సు లక్షణాలను గమనిస్తే అకాల యుక్త వయస్సుగా పరిగణిస్తారు. 

ముఖ్యంగా యువతల్లో ఈ లక్షణాలకు వేగంగా బరువు పెరగడం, ఆహారం, ఒత్తిడి వ్యాయామం లేకపోవడం వల్ల ఎండోక్రైన్ వ్యవస్థ చెదిరిపోయి అకాల యుక్త వయస్సు సమస్యతో బాధపడతారు. అమ్మాయిల్లో శారీరక యుక్త పెరిగితే మనం కొన్ని సంకేతాలను గమనించవచ్చు. రొమ్ము మొగ్గ అభివృద్ధి, గ్రోత్ స్పర్ట్, ఆక్సిలరీ హెయిర్ డెవలప్ మెంట్, చివరిగా రుతుక్రమం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు 9 సంవత్సరాల కంటే ముందుగా శారీరక అభివృద్ధిని గమనిస్తే వైద్యులను సంప్రదించడం మేలు. సాధారణంగా, తల్లిదండ్రులు తమ పిల్లలను చంకలో జుట్టు పెరుగుదలను గమనించినప్పుడు తీసుకువస్తారు. కొన్నిసార్లు, పిల్లలు యుక్త వయస్సు మొదటి నాలుగు దశలను (దృశ్యమైన శారీరక ఎదుగుదలతో) దాటినప్పుడు, వారి రుతుక్రమానికి కేవలం ఆరు నుంచి ఎనిమిది నెలల దూరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువస్తారు. ఈ సమయంలో వారికి సరైన చికిత్స చేయడం కష్టం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

అకాల యుక్త వయస్సు వల్ల కలిగే సమస్యలు

సాధారణంగా చిన్న వయస్సులో అకాల యుక్త వయస్సు వస్తే తోటి స్నేహితులతో మెలగడానికి వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే చిన్న వయస్సులో ఎముకలు పరిపక్వత చెందడంతో ఎత్తు సమస్యతో బాధపడతారు. మొదటిలో బాగా ఎత్తుగా కనిపించినప్పటికీ దీర్ఘకాలంలో 15-20 సెంటీ మీటర్ల ఎత్తు తగ్గుతారు. అలాగే ఊబకాయం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి ఇతర ఆరోగ్య సమస్యల అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

చికిత్స విధానం

కొద్ది శాతం మంది బాలికలలో అకాల యుక్తవయస్సు అంతర్లీనంగా ఉన్న ఎండోక్రైన్ సమస్య ఫలితంగా ఉండవచ్చు. అందువల్ల అకాల యుక్తవయస్సు ఉన్న బాలికలందరికీ ఎండోక్రినాలజిస్ట్ ద్వారా వైద్య సాయం అందించాలి. ఈ పరిస్థితి రుతుక్రమం ప్రారంభాన్ని ఆలస్యం చేయడానికి కొన్ని మందులతో సురక్షితంగా, ప్రభావవంతంగా చికిత్స చేయవచ్చు. పిల్లవాడు తగిన వయస్సు వచ్చే వరకు యుక్తవయస్సు ఆలస్యం కావచ్చు. తల్లిదండ్రులకు, యుక్తవయస్సులో జరిగే శరీర మార్పులను ప్రారంభ దశల్లోనే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా తగిన సమయంలో వైద్య సంరక్షణను పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం