AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premature Aging: 35 ఏళ్లకే వృద్ధాప్యం ముంచుకోస్తుందా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నవయవ్వనం మీ సొంతం

కొందరు అమ్మాయిలు 35 ఏళ్లకే వారు 50 ఏళ్ల వయస్సు ఉన్నవారిలా కనిపిస్తారు. ముఖ్యంగా మహిళలు చిన్న వయస్సులో, వారి ముఖాలు ముడతలు పడి, మధ్య వయస్కులైన మహిళలలా కనిపిస్తారు. ఇదంతా మహిళల రోజువారి అలవాట్ల వల్లనే జరుగుతుంది. కాబట్టి మహిళలు వృద్ధులుగా ఎందుకు కనిపిస్తారు? ఈ వృద్ధాప్యాన్ని వదిలించుకోవడానికి..

Premature Aging: 35 ఏళ్లకే వృద్ధాప్యం ముంచుకోస్తుందా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నవయవ్వనం మీ సొంతం
Premature Aging In Women
Srilakshmi C
|

Updated on: Jul 28, 2025 | 8:37 PM

Share

పుట్టిన వారు గిట్టక మానరు.. అనేది ఎంత సహజమో.. పుట్టిన వారంతా వృద్ధాప్యం చెందుతారనేది అంతే సహజం. ఈ వృద్ధాప్య ప్రక్రియను ఎవరూ ఆపలేరు. కానీ ఆహారం, జీవనశైలి కారణంగా కొంతమంది త్వరగా పెద్దవారిగా కనిపిస్తారు. 35 ఏళ్లకే వారు 50 ఏళ్ల వయస్సు ఉన్నవారిలా కనిపిస్తారు. ముఖ్యంగా మహిళలు చిన్న వయస్సులో, వారి ముఖాలు ముడతలు పడి, మధ్య వయస్కులైన మహిళలలా కనిపిస్తారు. ఇదంతా మహిళల రోజువారి అలవాట్ల వల్లనే జరుగుతుంది. కాబట్టి మహిళలు వృద్ధులుగా ఎందుకు కనిపిస్తారు? ఈ వృద్ధాప్యాన్ని వదిలించుకోవడానికి, యవ్వనంగా కనిపించడానికి ఏం చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

వేగంగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడానికి కారణాలు ఇవే

ఒత్తిడి

ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ ముఖ రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మిమ్మల్ని త్వరగా పెద్దవారిగా కనిపించేలా చేస్తుంది. ఒత్తిడి మీ చర్మాన్ని నిస్తేజంగా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది మిమ్మల్ని అకాలంగా పెద్దవారిగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించడానికి నడక, వ్యాయామం, ధ్యానం వంటి వ్యాయామాలు చేయాలి.

నిద్ర

నిద్ర లేకపోవడం వల్ల కూడా చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మహిళల్లో అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. ఇది ముఖంపై ముడతలు, కళ్ళ కింద నల్లటి వలయాలు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అందువల్ల మహిళలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

ఇవి కూడా చదవండి

కోపం

ఇటీవలి పరిశోధనలలో కోపం అకాల వృద్ధాప్యానికి దారితీస్తుందని తేలింది. కాబట్టి మహిళలు తమ కోపాన్ని కట్రోంల్‌ చేసుకోవడం మంచిది.

జంక్ ఫుడ్

ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు వస్తాయి. దీనివల్ల మహిళలు త్వరగా పెద్దవారిగా కనిపిస్తారు. అందువల్ల మహిళలు పండ్లు, కూరగాయలు, నీరు, ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం.

సన్‌స్క్రీన్

ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల చర్మం నల్లబడటం, అకాల వృద్ధాప్యం సంభవిస్తుంది. దీనిని ఫోటోఏజింగ్ అంటారు. సూర్యరశ్మి చర్మ కణాలను దెబ్బతీస్తుంది. చర్మం పొడిబారడానికి, ముడతలు, మచ్చలను అభివృద్ధి చేయడానికి కారణమవుతుంది. అందువల్ల మహిళలు ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం.

ధూమపానం

అధిక ధూమపానం, మద్యం సేవించడం వల్ల మహిళల చర్మం పొడిబారి, మసకబారుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల చర్మం నిస్తేజంగా మారి, వయసు పైబడినట్లు కనిపిస్తుంది. అందుకే మహిళలు ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.