
ఖర్జూర, బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజూ ఈ బెల్లం ఖర్జూరా లడ్డు తినడం చాలా మంచిది. బెల్లం, ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. అందుకే చలికాలంలో ఈ లడ్డూ తినడం చాలా మంచిది. బెల్లం, ఖర్జూరాలు బాడీలో వేడి పెంచడంలో సహాయపడతాయి. తద్వారా మీ చల్లటి వాతావరణంలో మీ శరీరం వెచ్చగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
బెల్లంతో పాటు ఖర్జూరాల్లో కాల్షియం కూడా లభిస్తుంది. ఇది ఎముకల బలానికి తోడ్పడుతుంది. దీంతో ఎముకల బలహీనత రాకుండా కాపాడుకోవచ్చు. బెల్లంతో పాటు ఖర్జూరాల్లో నేచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. దీంతో చలికాలంలో ఎల్లపుడూ ఉల్లాసంగా ఉండేందుకు ఈ లడ్డూ సహాయపడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి. తద్వారా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
ఖర్జూరాల్లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. బెల్లం, ఖర్జూరాల్లో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లలో మంట, వాపు ఏర్పడకుండా కాపాడుతాయి. తద్వారా ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట రెండు బెల్లం ఖర్జూరా లడ్డూలు తినండి. గోరువెచ్చని పాలతో కలిపి తింటే పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అయితే డయాబెటిస్, బరువు అదుపులో ఉండాలనుకునే వారు తినేముందు డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..