అబ్బాయిలూ బీ అలర్ట్.. పెళ్లి తర్వాత ఈ తప్పులు చేస్తే.. ఇక లైఫంతా ఆల్‌జీబ్రానే

మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులు మన సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. మరి వివాహం తర్వాత పురుషులు చేసే తప్పులు ఏమిటి? వీటి నుండి వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది..? మానసిక నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

అబ్బాయిలూ బీ అలర్ట్.. పెళ్లి తర్వాత ఈ తప్పులు చేస్తే.. ఇక లైఫంతా ఆల్‌జీబ్రానే
Relationship Tips

Updated on: Jul 30, 2025 | 4:28 PM

సాధారణంగా మనం కొన్నిసార్లు ఊహించని తప్పులు చేస్తాము. అవి పెద్ద పెద్ద తప్పులుగా మారి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రతి ఒక్కరూ తెలియకుండానే ఈ తప్పులు చేస్తారు. తరువాత, ఈ తప్పుల వల్ల వారు చాలా సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివాహం తర్వాత, పురుషులు చేసే తప్పులు వారి వైవాహిక జీవితంలో పెద్ద అంతరాన్ని సృష్టిస్తాయి. ఆ తప్పులు చిన్నవిగా అనిపించినా, అవి వారి మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. కాబట్టి, పురుషులు వీటిని ముందుగానే గుర్తించి, ఆ తప్పులు చేయకుండా ఉండాలి. పెళ్లి తర్వాత ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించగలరు. లేకపోతే, పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.

పెళ్లి తర్వాత పురుషులు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి..

సానుభూతి చూపలేకపోవడం – భావాలను అర్థం చేసుకోకపోవడం: ఏ సంబంధంలోనైనా ప్రేమ, నమ్మకంతోపాటు సానుభూతి చూపడం చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే, ఈ విషయంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఆలోచిస్తారు.. స్త్రీలు ఇతరుల పరిస్థితులతో సానుభూతి చెందుతారు. కానీ పురుషులు ఎక్కువ ఆచరణాత్మకంగా ఉంటారు. నిజం చెప్పడం కంటే ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం.. సానుభూతి చూపడం మంచిది.. భాగస్వామి భావాలను అర్థం చేసుకోని ముందుకు సాగితే.. ఎలాంటి సమస్య తలెత్తదు..

ఖర్చు చేయడం: ఈ విషయంలో కూడా స్త్రీలు పురుషుల కంటే ముందంజలో ఉంటారు. పురుషులు ముందు వెనుక ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. కానీ స్త్రీలు తెలివిగా ఖర్చు చేస్తారు. ఖర్చు అవసరమా కాదా అని వారు రెండుసార్లు ఆలోచిస్తారు. వారు చాలా ఆలోచించిన తర్వాతే ఖర్చు చేస్తారు. ఈ విషయంలో, పురుషులు ఖర్చు చేసే ముందు మహిళల సలహా తీసుకోవడం మంచిది. లేకపోతే, ఇంట్లో గొడవలు తలెత్తడం ఖాయం..

లైంగిక విషయాలు – గత ప్రేమ విషయాలు చెప్పడం : ఇది చాలా మంది పురుషులు ఎప్పుడూ ఆలోచించని విషయం. లైంగికంగా తమకు ఏమి కావాలో మాత్రమే ఆలోచించే పురుషులు.. ఒక్క క్షణం కూడా భాగస్వామి గురించి.. వారి ఆలోచనల గురించి ఆలోచించరు. ఎల్లప్పుడూ ప్రేమ – ఆప్యాయత పొందాలంటే.. లైంగిక విషయాలు – గత ప్రేమ విషయాలు చెప్పకుండా ఉండాలి.. అలా చేస్తే భార్యభర్తల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంది.. అందుకే.. పెళ్లైన తరువాత భాగస్వామి గురించి.. ఆమె ఆలోచనల గురించి కూడా ఆలోచించడం మంచిది. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది.

భావోద్వేగాలను అర్థం చేసుకోకపోవడం: ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. స్త్రీలు వాటిని పరిస్థితిని బట్టి వ్యక్తపరుస్తారు, కానీ పురుషులు తమ భావోద్వేగాలను బయటపెడితే స్టేటస్ తగ్గుతుందేమోనని భావించి ఏమీ మాట్లాడరు. బదులుగా, మీ అభిప్రాయాన్ని వారికి చెప్పండి.. మీ మనసు విప్పి మాట్లాడండి. మీకు అనిపించినప్పుడు వారిని కూర్చోబెట్టి మాట్లాడటం మంచిది. మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, సమస్య ఏమిటో సున్నితంగా వివరించాలి. దీనివల్ల అక్కడ సగం సమస్యలు అక్కడే.. అప్పటికప్పుడే పరిష్కారమవుతాయి.

ప్రాధాన్యత ఇవ్వకపోవడం – విస్మరించడం సరైనది కాదు: స్త్రీలు ఏదైనా చెప్పినప్పుడు పురుషులు పట్టించుకోకపోవడం లేదా వినకపోవడం కూడా పెద్ద తప్పు. మీరు సమస్యను పరిష్కరించలేకపోవచ్చు. కానీ కనీసం మీరు వినడం ద్వారా వారికి సహాయం చేయాలి. ఇది భార్యలకు వారి బాధను వినగల వ్యక్తి ఉన్నాడనే విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది వారికి కొంత విశ్రాంతిని.. ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి వారు చెప్పేది వినండి, అది సరైనదో కాదో.. అప్పుడు మీరు ఏమనుకుంటున్నారో వారికి చెప్పండి. అప్పుడు వారు వినకపోతే, మాట్లాడటానికి కొంత సమయం కేటాయించండి. ఇది వారి పట్ల మీకున్న గౌరవాన్ని చూపుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..