
కొత్త ఊరగాయ పచ్చడి వాసనకే కడుపు నిండిపోతుంది. వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకుని.. కాస్తింత నెయ్యి దట్టిస్తే రుచి అదిరిపోవాల్సిందే. అందుకే తెలుగు వారికి ఊరగయా పచ్చల్లకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఇది లేకుండా ఏ శుభకార్యం విందు కూడా పూర్తవదు. అయితే ఊరగాయ అంటే కేవలం ఉప్పు, ఘాటు కారం, మసాలాలు మాత్రమే కాదు. వాటి తయారీ, నిల్వ ప్రక్రియలో అనేక రసాయన మార్పులు జరుగుతాయి. వీటిలో కొన్ని సహజమైనవి, అవసరమైనవి ఉంటే.. మరికొన్ని అనవరసరమైనవి కూడా వచ్చి చేరుతాయి. అందుకే ఊరగాయ పచ్చడి ఇష్టమని రోజూ తింటే ఆరోగ్యానికి హాని తలెత్తుతుందని ఆరోగ్యి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊరగాయలో ప్రధాన పదార్థం సోడియం క్లోరైడ్ (ఉప్పు). ఇది సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడం ద్వారా ఆహారాన్ని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. అయితే అధిక ఉప్పు వినియోగం రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అదేవిధంగా వెనిగర్, సోర్ ద్రావణంలోని ఎసిటిక్ ఆమ్లం, నిమ్మకాయలలోని సిట్రిక్ ఆమ్లం నిల్వకు సహాయపడతాయి. అధిక ఆమ్లత్వం కడుపు చికాకు, ఆమ్ల సమస్యలకు దారితీస్తుంది.
మిరపకాయలకు కారంగా ఉండే కాప్సైసిన్ తక్కువ మొత్తంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ అధికంగా తీసుకుంటే అది గ్యాస్ట్రిటిస్, కడుపు పొరకు హాని కలిగిస్తుంది. ఊరగాయలలో ఉపయోగించే నూనెలోని కొవ్వులు (ట్రైగ్లిజరైడ్లు) అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్, గుండె సమస్యలకు దారితీస్తుంది. చాలా ఊరగాయలను కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఈ ప్రక్రియ లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. అయితే సరిగ్గా నిల్వ చేయకపోతే ప్రమాదకరమైన విషపూరిత సమ్మేళనాలు కూడా ఏర్పడతాయి.
ఇటీవలి వాణిజ్య ఊరగాయలలో తరచుగా కృత్రిమ సంరక్షణకారులు, రంగులు, సోడియం బెంజోయేట్, పొటాషియం సోర్బేట్ వంటి రుచిని పెంచే పదార్ధాలను వాడుతున్నారు. వీటిని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల పిల్లలలో అలెర్జీలు, హైపర్యాక్టివిటీ ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అఫ్లాటాక్సిన్, బోటులినమ్ టాక్సిన్ వంటి విషపదార్థాల వల్ల అతి పెద్ద ప్రమాదం తలెత్తుంది. ఇవి సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల ఉత్పత్తి అవుతాయి. ఇవి కాలేయానికి హాని కలిగించేంత తీవ్రమైనవి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా. అందువల్ల ఊరగాయల పచ్చళ్లను పూర్తిగా నివారించకపోయినా పరిమితం తీసుకోవడం మంచిది
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.