Fact Check: కేంద్రం సమోసా, జిలేబికి కూడా సిగరెట్‌ తరహా హెచ్చరికలు జారీ చేసిందా?

Fact Check: స్థానిక విక్రేతలు విక్రయించే ఆహార పదార్థాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాలో ఎటువంటి హెచ్చరిక లేబుల్‌లు లేవని పీఐబీ (PIB) స్పష్టం చేసింది. సాంప్రదాయ భారతీయ స్నాక్స్‌ను నిర్దిష్టంగా లక్ష్యంగా చేసుకోవడం లేదని కూడా ఇది ధృవీకరించింది. వీటిపై కేంద్ర మంత్రిత్వశాఖ..

Fact Check: కేంద్రం సమోసా, జిలేబికి కూడా సిగరెట్‌ తరహా హెచ్చరికలు జారీ చేసిందా?

Updated on: Jul 15, 2025 | 5:42 PM

సమోసాలు, జిలేబీలు, లడ్డూలు వంటి ప్రసిద్ధ భారతీయ చిరుతిళ్లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసిందని ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్-చెక్ యూనిట్ మంగళవారం తోసిపుచ్చింది.

స్థానిక విక్రేతలు విక్రయించే ఆహార పదార్థాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాలో ఎటువంటి హెచ్చరిక లేబుల్‌లు లేవని పీఐబీ (PIB) స్పష్టం చేసింది. సాంప్రదాయ భారతీయ స్నాక్స్‌ను నిర్దిష్టంగా లక్ష్యంగా చేసుకోవడం లేదని కూడా ఇది ధృవీకరించింది. వీటిపై కేంద్ర మంత్రిత్వశాఖ హెచ్చరిక లేబుల్‌ జారీ చేసిందని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Personality Test: మీ ముక్కు ఆకారం ఇలా ఉందా? మీరు ఎలాంటి వారో చెప్పేయవచ్చు!

ఈ మేరకు పీఐబీ Xలో ఒక పోస్ట్‌లో పేర్కొంది. కొన్ని మీడియా నివేదికలు @MoHFW_INDIA సమోసాలు, జిలేబీ, లడ్డూ వంటి ఆహార ఉత్పత్తులపై ఆరోగ్య హెచ్చరిక జారీ చేసిందని పేర్కొన్నాయని, ఇలాంటి సమాచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాలో విక్రేతలు విక్రయించే ఆహార ఉత్పత్తులపై ఎటువంటి హెచ్చరిక లేబుల్‌లు జారీ చేయలేదని తెలిపింది.

 

అయితే జంక్ ఫుడ్ ను సిగరెట్ల వలె ప్రమాదకరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెబుల్‌ జారీ చేసిందని, పెరుగుతున్న ఊబకాయాన్ని ఎదుర్కోవడానికి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమోసాలు, జిలేబీలు వంటి డీప్-ఫ్రై చేసిన స్నాక్స్‌లకు సిగరెట్ ప్యాక్‌లపై ఉన్నటువంటి ఆరోగ్య హెచ్చరికలను ఆదేశించిందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై పీఐబీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఇందులో నిజం లేదని తెలిపింది.

ఇది కూడా చదవండి: Petrol Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎక్కడెక్కడ అంటే..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి