Telugu News Lifestyle Personality test your nose: the shape of your nose reveals these personality traits
Personality Test: వ్యక్తిత్వాన్ని తెలిపే ముక్కు షేప్.. ఎటువంటి ముక్కు ఉంటే.. ఏ రకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలుసా..
ఫేస్ రీడర్‌లు ఒక వ్యక్తి ముక్కు ఆకారం నుంచి అతని పాత్ర, వ్యక్తిత్వ లక్షణాల గురించి కూడా చెప్పగలరు. ఫేస్ రీడింగ్ కళ 3,000 సంవత్సరాల నాటిదని మీకు తెలుసా? ఫేస్ రీడింగ్ నిపుణుడు, రచయిత జీన్ హన్నెర్ ప్రకారం ఫేస్ రీడింగ్ ఓపెన్ బుక్ వంటిది.. అది వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది. ఫేస్ రీడర్ల ప్రకారం ముక్కు ఆకారం వ్యక్తిత్వం గురించి వెల్లడిస్తుంది. ఈ నేపధ్యంలో ముక్కులు ఎన్ని రకాలుగా ఉంటాయి.. ఏ ఆకారంలోని ముక్కు కలిగి ఉంటే.. ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలుసుకుందాం..
Personality Test Your Nose
Follow us on
ఫేస్ రీడర్‌లు ఒక వ్యక్తి ముక్కు ఆకారం నుంచి అతని పాత్ర, వ్యక్తిత్వ లక్షణాల గురించి కూడా చెప్పగలరు. ఫేస్ రీడింగ్ కళ 3,000 సంవత్సరాల నాటిదని మీకు తెలుసా? ఫేస్ రీడింగ్ నిపుణుడు, రచయిత జీన్ హన్నెర్ ప్రకారం ఫేస్ రీడింగ్ ఓపెన్ బుక్ వంటిది.. అది వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది. ఒక వ్యక్తిగా మీరు ఎవరు అనే విషయం గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాదు యుగాలుగా ముక్కుల ఆకృతి, మన జన్యు చరిత్ర మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయడానికి అనేక అధ్యయనాలు, పరిశోధనలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు విభిన్న జాతులు , వాతావరణ మండలాల నుండి ముక్కు ఆకారాలను అర్థంచేసుకోవడం కోసం వ్యక్తులకు సంబంధించిన 3D స్కాన్‌లను అధ్యయనం చేశారు. ఫేస్ రీడర్ల ప్రకారం ముక్కు ఆకారం వ్యక్తిత్వం గురించి వెల్లడిస్తుంది. ఈ నేపధ్యంలో ముక్కులు ఎన్ని రకాలుగా ఉంటాయి.. ఏ ఆకారంలోని ముక్కు కలిగి ఉంటే.. ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలుసుకుందాం..
నుబియన్ ముక్కు: ముక్కు స్ట్రెయిట్ గా, నోస్ పాయింట్స్ క్రిందికి ఉంటే నూబియన్ ముక్కు అంటారు. ఈ రకమైన ముక్కు ఉన్న వ్యక్తులకు సృజనాత్మకత ఎక్కువ. సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త మార్గాలు ఎంచుకుంటారు. అంతేకాదు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడానికి ఉత్సాహం కలిగి ఉంటారు. ఆశావాదులు. ఓపెన్ మైండ్ గా ఉంటారు. కొత్త విషయాల పట్ల ఉత్సాహం కలిగి ఉంటారు. వీరు మంచి స్నేహశీలి. వీరి స్వభావాన్ని ఇతరులను ఇష్టపడతారు. ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉంటారు.
గ్రీకు ముక్కు: పురాతన గ్రీకు శిల్పాల్లో ఎక్కువగా ఈ ముక్కు ఆకారాన్ని పోలి ఉంటుంది. కనుక దీనిని గ్రీక్ ముక్కు, రోమన్ ముక్కు లేదా గ్రీన్ నోస్ అని పిలుస్తారు. ముక్కు నిటారుగా..స్ట్రెయిట్ గా.. ఉంటుంది. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. తమ భావోద్వేగాలను ప్రదర్శించలేరు. పది మందిలో తాము స్పెషల్ గా నిలబడడానికి ఇష్టపడరు. నమ్మకమైన వ్యక్తులలో ఎన్నదగిన వారు. జీవితంపై ఆచరణాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటారు. చాలా సేపు ఆలోచించి గానీ ఓ నిర్ణయం తీసుకోరు.
హుక్డ్ ముక్కు: ముక్కు మధ్యలో కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటే అది హుక్డ్ ముక్కు. అంటే పక్షి యొక్క ముక్కును లేదా ఒక కొక్కీ వంటి ముక్కును పోలి ఉండటం వల్ల దీనికి హుక్ నోస్ అని పేరు వచ్చింది.
వీరు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటా. లక్ష్యాలను చేధించడానికి అంకితభావంతో పని చేస్తారు. బలమైన నమ్మకం కలిగి ఉండే వీరు ప్రతిదానికీ కొన్ని విభిన్న సూత్రాలను కలిగి ఉంటారు.
Personality Test Your Nose1
ఓర్లి ముక్కు: ఈ రకం ముక్కు ఉన్న వ్యక్తులు కెరీర్, వృత్తిపరమైన సక్సెస్ కోసం ఆలోచిస్తారు. వీటికి అన్నింటి కంటే ప్రాధాన్యతనిస్తారు. మంచి తెలివైనవారు, వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో తాము కోరుకున్నది సాధించే వరకు పట్టుదలను విడిచిపెట్టరు.
ఇవి కూడా చదవండి
ముక్కు పైకి: ఈ రకం ముక్కు ఉన్న వ్యక్తులు ఇతర వ్యక్తులతో పోలిస్తే తమ నిర్ణయాలలో ఇతరులకు మార్గనిర్దేశం చేసే బలమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు. ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. వీరి ఉల్లాసమైన వ్యక్తిత్వంతో పది మందిని ఆకర్షిస్తారు.
నిటారైన ముక్కు: వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువే. ఇతరుల మనసులో ఉన్న విషయాలను పసిగట్టే శక్తి వీరికి ఎక్కువ. తమ ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచి నమ్మకస్తులు. అయితే వీరు వ్యాపార రంగంలో రాణిస్తారట.
డైంటీ ముక్కు: అంటే చాలా చిన్న ముక్కు కలిగి ఉన్నవారు సామాజిక అంశాల పట్ల శ్రద్ధ ఎక్కువట. మృదు స్వభావులుగా ఉంటారు. అయితే కొన్ని సార్లు షార్ట్ టెంపర్‌కు లోనవుతారట. వీరు స్నేహపూర్వకంగా, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అయితే భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక త్వరగా కోపానికి గురవుతారు. ఇతరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. కొన్నిసార్లు తమ గురించి తామే మరచిపోతారు.
వంకర ముక్కు: వంగినట్లుగా ఉండే ముక్కు ఉన్నవారి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీరు స్థిరంగా ఉంటారు. వీరి అభిరుచులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మంచి శ్రోతలు. నమ్మకమైన వ్యక్తులు. చాలా ఆచరణాత్మకమైన అలోచాలు కలిగి ఉంటారు. ఏ విషయంపైనైనా చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారట. సమస్యలు ఎదురైనప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తారట.