
Personality Test: మన ముక్కుల ఆకారానికి, మన జన్యు చరిత్రకు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేయడానికి యుగయుగాలుగా అనేక అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు విభిన్న జాతులు, వాతావరణ మండలాల నుండి వచ్చిన వ్యక్తుల 3D స్కాన్‌లను అధ్యయనం చేసి ముక్కు ఆకారాల రకాలను అర్థం చేసుకున్నారు. నిపుణులు ముక్కు రంధ్రాల వెడల్పు, ముక్కు రంధ్రాల మధ్య దూరం, ముక్కు ఎత్తు, ముక్కు పొడవు, ముక్కు కొన పొడుచుకు వచ్చిన స్థాయి, ముక్కు రంధ్రాల ప్రాంతం, ముక్కు బాహ్య ప్రాంతాన్ని పరిశీలిస్తారు. కొందరికి శరీరంలోని భాగాలను ఆకట్టుకునేలా ఉంటాయి. కళ్లు, హెయిర్, ముక్కు వంటివి. శరీర భాగాల నిర్మాణాన్ని బట్టి వారు ఎలాంటి వారే చెప్పేస్తుంటారు. ఇక ప్రతి మనిషికి ముక్కు అనేది ఒక మాయాజాలం అలాంటిది. అతని వ్యక్తిత్వం గురించి చాలా చెప్పవచ్చు.ఈ నివేదికలో ఒక వ్యక్తి ముక్కు ఆధారంగా ఎలాంటి వ్యక్తిత్వం ఉందో తెలుసుకుందాం?
ఒక్కొక్కరికి రకరకాల అలవాట్లు ఉంటాయి. అలాగే వారి మనసత్వం కూడా రకరకాలుగా ఉంటుంది. వారి స్వభావం ఆధారంగా వారందరినీ మనం గుర్తించవచ్చు. ఎవరు ఏ విధంగా మాట్లాడుతారు.. ఎలాంటి స్వభావం ఉంటుందనేది ప్రతి ఒక్కరిని అంచనా వేయవచ్చు. సాధారణంగా మనం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అతని స్వభావం ఆధారంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము. వారి మాట్లాడే విధాన్ని బట్టి వారి గురించి చెప్పేయవచ్చు. వారి ప్రవర్తనను బట్టి సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ముక్కు ఆకారం అతని మనస్సులోని లోతైన రహస్యాలను తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఎలాంటి వ్యక్తి అతని హృదయంలో ఎలాంటి రహస్యం దాగి ఉందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా అతని ముక్కు ఆకారాన్ని చూసి మాట్లాడకుండానే మనం అతని గురించి తెలుసుకోవచ్చంటున్నారు. వ్యక్తి స్వభావంతో పాటు ఒక వ్యక్తి శరీర భాగాల నిర్మాణం కూడా అతని గురించి చాలా చెబుతుంది.
నిటారుగా ఉండే ముక్కు:
కొంతమందికి ముక్కు నిటారుగా ఉంటుంది. వారి ముక్కును బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ముక్కు దిగువ భాగం క్రిందికి వంగి ఉంటుంది. అలాంటి వ్యక్తులు సహజంగా చాలా ఆసక్తిగా ఉంటారట. ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త పనులు చేయడానికి ఇష్టపడతారట. అంతే కాదు వారు మంచి మాటకారి. వాళ్లు మాట్లాడే విధానం అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. వారి మాటతీరును బట్టి ఆకర్షితులవుతారు.
ముక్కు పదునుగా ఉండటం:
కొంత మంది ముక్కు పొడవు ఉండకుండా నిటారుగా ఉంటుంది. కానీ ముక్కు ముందుభాగంలో కొంత పదునుగా ఉంటుంది. ఇలాంటి ముక్కు ఉన్న వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వివేకవంతమైన గుణం కలిగి ఉంటారట. ఇలాంటి వారు ఏది చేసినా ప్లాన్ ప్రకారం చేస్తూ ముందుకు సాగుతారు. ఇలాంటి ముక్కు ఉన్న వారు మంచి లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా నిజాయితీగా ఉంటారు.
పక్షి లాంటి ముక్కు:
కొంతమందికి ముక్కు పక్షి ముక్కు ఆకాలంలో ఉంటుంది. అలాంటి వారు చాలా తెలివైన వారు. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు ఏదైనా రిస్క్ తీసుకోవాలంటే దూరంగానే ఉంటారు. ఏదైనా పని చేయలంటే సులభంగా చేసేందుకు ఇష్టపడతారట. మంచి గుణం కలిగి ఉంటుంది. భక్తి భావన ఎక్కువగా ఉంటుంది. వారి తెలివి తేటలు, ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.
పదునైన ముక్కు:
కొంత మందికి ముక్కు పదునుగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు మంచి పద్దతులు కలిగి ఉంటారట. తమ పనులన్ని కూడా స్వయంగా చేసుకునేందుకు ఇష్టపడతారు. వారి నాయకత్వ నైపుణ్యాలు అసాధారణమైనవి. వారికి ఎవరైనా మోసం చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సహించరు. వారిని మోసం చేసిన వారిని అస్సలు క్షహించరు.
(నోట్: ఇందులోని అంశాలు ప్రజల విశ్వాసాలు, ఇతర సోషల్ మీడియా, వెబ్‌సైట్ల ద్వారా అందించనవి మాత్రమే. ఎవరి నమ్మకాలు వారివి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి