Knee Pains: మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

|

Jul 31, 2024 | 6:10 PM

ఒకప్పుడు కేవలం పెద్దల్లో మాత్రమే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు కనిపించేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉండే వారే మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా తినే ఆహారం కారణంగా మోకాళ్ల నొప్పులు అనేవి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్లు నొప్పులు వస్తే.. ఏ పని చేయడానికి కూడా వీలు పడదు. ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా లేడీస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు చాలా మంది..

Knee Pains: మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
Knee Pain
Follow us on

ఒకప్పుడు కేవలం పెద్దల్లో మాత్రమే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు కనిపించేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉండే వారే మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా తినే ఆహారం కారణంగా మోకాళ్ల నొప్పులు అనేవి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్లు నొప్పులు వస్తే.. ఏ పని చేయడానికి కూడా వీలు పడదు. ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా లేడీస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు చాలా మంది తెలీకుండా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటారు. వీటి కారణంగా నొప్పులు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే ఆహారాలు దూరంగా ఉండటం మంచిది. మరి మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు:

మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధ పడేవారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. చాలా మితంగానే ఉప్పు తీసుకోవాలి. రోజు వారి ఆహారంలో కూడా ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తింటే మోకాళ్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి.

చక్కెర:

మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు చక్కెరకు కూడా దూరంగా ఉండాలి. పంచదార ఉన్న ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరుగుతాయి. దీంతో శరీరంలో మంట అనేది పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ అయితే కీళ్ల నొప్పులు కూడా ఎక్కువ అవుతాయి.

ఇవి కూడా చదవండి

పాల ఉత్పత్తులు:

మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నప్పుడు పాల ఉత్పత్తుల కూడా తీసుకోకూడదు. వీటిని తినడం వల్ల శరీరంలో మంటను పెంచతాయి. దీంతో నొప్పులు అనేవి మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి దూరంగా ఉండాలి.

ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్:

ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు కూడా మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు తినకూడదు. వీటిని తినడం వల్ల మోకాళ్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. ఇవి వాతాన్ని పెంచుతాయి.

వేయించిన ఆహారాలు:

మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వీటిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మోకాళ్లు, కీళ్ల వాపులకు గురి చేస్తాయి. నొప్పులు కూడా మరింత రెట్టింపు అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..