Patanjali: పాలు, పెరుగు, తేనెతో ఈ ఆహారపదార్ధాలను కలిపి తిన్నారో అనారోగ్యానికి వెల్కం బోర్డ్ పెట్టేసినట్లే..

మనం ఏది తిన్నా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చాలా ఆహారాలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. కొన్ని ఆహారాలు తప్పుగా తీసుకుంటే ప్రయోజనానికి బదులుగా ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. ఈ రోజు ఆయుర్వేదం ప్రకారం పొరపాటున కూడా ఏ ఆహారాలను కలిపి తీసుకోకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

Patanjali: పాలు, పెరుగు, తేనెతో ఈ ఆహారపదార్ధాలను కలిపి తిన్నారో అనారోగ్యానికి వెల్కం బోర్డ్ పెట్టేసినట్లే..
Patanjali Health Tips

Updated on: Sep 18, 2025 | 3:03 PM

గత కొంత కాలంగా ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి అవగాహన పెరుగుతోంది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆహారం, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నందున ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వెనుక అవసరాన్ని గుర్తిస్తున్నారు. అయితే తెలిసీ, తెలియక చాలా మంది జంక్ ఫుడ్ తింటున్నారు. దీంతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నేపధ్యంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఆయుర్వేదం విశిష్టతని తెలియజెస్తూ అవగాన కలిగిస్తున్నారు.

పతంజలి సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ఆయుర్వేదం గురించి అవగాహన కల్పించడానికి అనేక పుస్తకాలు రాశారు. అలాంటి ఒక పుస్తకం “ది సైన్స్ ఆఫ్ ఆయుర్వేదం”. ఈ పుస్తకం ఏ ఆహార కలయికలు మీ ఆరోగ్యానికి హానికరం అని వివరిస్తుంది. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడమే కాదు విష పదార్థాలు కూడా పెరుగుతాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరాన్ని హాని నుంచి రక్షించుకోవడానికి ఏ ఆహారాలను కలిపి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ చెడు ఆహార కలయికల గురించి ఈ రోజు వివరంగా అన్వేషిద్దాం.

తప్పుడు ఆహార కలయికల వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలు

” ఆయుర్వేద శాస్త్రం ” అనే పుస్తకం మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది. కొన్ని ఆహారాలు ప్రయోజనకరం.. అయితే అవి మరికొన్ని ఆహారాలతో కలిస్తే ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఒకదానికొకటి సరిగ్గా సరిపోని ఆహారాలు తినడం వల్ల శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. వీటిని వదిలించుకోవడం కష్టమవుతుంది. ఇది జీర్ణక్రియను బలహీనపరుస్తుంది. శరీరంలోని మూలకాలను (లోహాలు) అసమతుల్యత చేస్తుంది. వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. తప్పుడు ఆహారం తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతే కాదు తప్పుడు సమయంలో, తప్పుడు వాతావరణంలో తప్పుడు ఆహారం తినడం, చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉన్న ఆహారం తినడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆహార కలయికలు ఆరోగ్యానికి మంచిది కాదు.

పాలతో ఈ ఆహారాలను తీసుకోవద్దు: ఎముకలను బలోపేతం చేయడానికి పాలు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే పాలతో కలిపి తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఉదాహరణకు పెరుగును పాలతో కలిపి తినకూడదు. ముల్లంగి, ముల్లంగి ఆకులు, పచ్చి సలాడ్, నగ్గెట్స్, చింతపండు, పుచ్చకాయ, కొబ్బరి, జిలేబీ, నువ్వుల లడ్డు, శనగలు, పప్పులు, సిట్రస్ పండ్లు మొదలైన ఆహారాలను కూడా పాలతో కలిపి తినకూడదు.

పెరుగుతో వీటిని తినవద్దు: పెరుగు చల్లదనాన్ని కలిగిస్తుంది. కనుక పెరుగుతో వేడి ఆహారాన్ని తినకపోవడం మంచిది. జున్ను (పనీర్), కీర దోసకాయలను పెరుగుతో తినకూడదు.

బియ్యంతో వీటిని నివారించండి: ఆయుర్వేదం ప్రకారం బియ్యంతో వెనిగర్ వాడకూడదు. బియ్యం , వెనిగర్ కలయిక జీర్ణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్ట్రిటిస్‌కు దారితీస్తుంది.

తేనెతో తినకూడని ఆహారాలు: వేడి నీరు, వేడి పాలు, నూనె, నెయ్యి,ల్ల మిరియాలు వంటి కొన్ని వస్తువులతో తేనె తీసుకోవడం కూడా నిషేధించబడింది. బరువు తగ్గడానికి చాలా మంది వేడి నీటితో తేనె కలిపి తాగుతారు. అయితే ఆయుర్వేదం ప్రకారం తేనెను నేరుగా వేడి నీటితో తినకూడదు. అలా చేయడం వల్ల తేనెలోని పోషకాలు నాశనం అవుతాయి.

అరటిపండ్లతో మజ్జిగ: అరటిపండ్లతో మజ్జిగ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆయుర్వేదం సూచిస్తుంది. అరటిపండ్లతో మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది. శరీరంలో విషం చేరుకుంటుంది. అరటిపండ్లు , మజ్జిగ రెండూ చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఇది జలుబు, దగ్గుకు దారితీస్తుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..