AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొప్పాయి వర్సెస్ పైనాపిల్‌.. వేసవిలో కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఏది బెస్ట్..?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మన జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహజమైన పండ్ల కంటే మెరుగైన పరిష్కారం మరొకటి లేదు. అయితే, అలాంటి పండ్లలో బొప్పాయి, పైనాపిల్‌లో బ్లోటింగ్ తగ్గించడంలో ఎలా పనిచేస్తాయో మీకు తెలుసా..?

బొప్పాయి వర్సెస్ పైనాపిల్‌.. వేసవిలో కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఏది బెస్ట్..?
Papaya Vs Pineapple For Digestion
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2026 | 1:41 PM

Share

వేసవిలో వేడి, జీర్ణక్రియ మందగించడం వల్ల కడుపు ఉబ్బరం సాధారణ సమస్యగా మారుతుంది. సమ్మర్‌లో చాలా మందిలో వచ్చే ఉదర సంబంధిత సమస్యలలో ప్రధానమైనది బ్లోటింగ్ (కడుపు ఉబ్బరం). దీనిని తగ్గించడంలో బొప్పాయి (Papaya), పైనాపిల్‌ (Pineapple) రెండూ అద్భుతంగా పనిచేస్తాయి. అయితే, వీటిలో ఏది ఎక్కువ ప్రభావవంతమైనదో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

బొప్పాయి (Papaya): బొప్పాయిలో పాపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తీసుకునే మాంసాహారం లేదా ఇతర ప్రోటీన్లను త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఫైబర్ (పీచు పదార్థం) మరియు నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది పేగుల కదలికను మెరుగుపరిచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ క్రమబద్ధీకరించబడుతుంది.

అనాసపండు (Pineapple): అనాసపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మిశ్రమం ఉంటుంది. ఇది కేవలం జీర్ణక్రియకే కాకుండా, పొట్టలో కలిగే అసౌకర్యాన్ని, వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అనాసపండు తిన్న వెంటనే జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. కాబట్టి భారీ భోజనం తర్వాత వచ్చే ఉబ్బరానికి ఇది తక్షణ పరిష్కారం.

ఇవి కూడా చదవండి

ఏది ఎప్పుడు ఎంచుకోవాలి?: భోజనం చేసిన తర్వాత కడుపు భారంగా, ఉబ్బరంగా అనిపిస్తే అనాసపండు ముక్కలను తీసుకోవడం ఉత్తమం. ఇది ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది. లేక మీకు నిరంతరం గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు ఉంటే, ప్రతిరోజూ ఉదయం బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

వేసవిలో ఈ రెండు పండ్లు కూడా మేలు చేస్తాయి. అయితే, వీటిని ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన కాసేపటి తర్వాత తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. అధికంగా చక్కెర కలిపిన జ్యూస్‌ల కంటే నేరుగా పండు ముక్కలను తినడం వల్ల అందులోని ఎంజైమ్‌లు, పీచు పదార్థం పూర్తిస్థాయిలో మన శరీరానికి అందుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us