Health Tips: విటమిన్ డి ఎక్కువైతే ఆ ప్రాణాంతక వ్యాధితో సహా అన్నీ సమస్యలే.. ఎలా తగ్గించుకోవాలంటే..?

|

Jul 03, 2023 | 5:57 PM

Vitamin D Side Effects: శరీరానికి కావాలసిన అన్ని రకాల పోషకాలు తగినంతగా లభిస్తేనే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం. అలా కాకుండా శరీరానికి కాలసిన మొత్తంలో ఏదైనా పోషకాన్ని తీసుకోకపోయినా, లేదా అందుకు అధికంగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలు..

Health Tips: విటమిన్ డి ఎక్కువైతే ఆ ప్రాణాంతక వ్యాధితో సహా అన్నీ సమస్యలే.. ఎలా తగ్గించుకోవాలంటే..?
Vitamin D Side Effects
Follow us on

Vitamin D Side Effects: శరీరానికి కావాలసిన అన్ని రకాల పోషకాలు తగినంతగా లభిస్తేనే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం. అలా కాకుండా శరీరానికి కాలసిన మొత్తంలో ఏదైనా పోషకాన్ని తీసుకోకపోయినా, లేదా అందుకు అధికంగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలు తప్పవు. అంటే ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి, అప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి పోషకాలలో విటమిన్ డి కూడా ఒకటి. సూర్యరశ్మి, తినే ఆహారం నుంచి లభించే ఈ విటమిన్ మన దంతాలు, ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. కానీ విటమిన్ డి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవంటున్నారు నిపుణులు. ఇంకా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. మరి శరీరంలో విటమిన్ డి ఎక్కువ అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వికారం, వాంతులు: విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, వికారం కలగవచ్చు. భోజనం చేసిన వెంటనే ఈ లక్షణం కనిపిస్తే మీ శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉందని గ్రహించాలి.

ఆకలి లేకపోవడం: ఆకలి లేకపోవడం కూడా శరీరంలో విటమిన్ డి ఎక్కువ ఉండడం వల్ల కలిగే సమస్యే.

ఇవి కూడా చదవండి

కాల్షియం నిల్వ: విటమిన్ డి మోతాడు శరీరంలో ఎక్కువ అయితే రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. ఫలితంగా హైపర్‌కాల్సెమియా అనే సమస్య ఎదురై వికారం, వాంతులు, ఆలసట, తరచూ మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కిడ్నీ సమస్యలు: కిడ్నీ సమస్యలు శరీరంలో అధిక విటమిన్ డి కారణంగా కలిగే హైపర్‌కాల్సెమియా వల్ల కూడా సంభవిస్తాయి. ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి, కాల్షియం శోషణను పెంచుతుంది. ఇలా జరిగితే మూత్రాపిండాలకు సంబంధించిన నెఫ్రోకాల్సినోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది.

అధిక విటమిన్ డి సమస్య నుంచి బయటపడేందుకు లేదా శరీరంలో దాని మోతాదును తగ్గించేందుకు.. అది ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్, సాల్మన్ ఫిష్, గుడ్డు సొన, సోయా పాలు వంటి ఆహారాలను తక్కువగా తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..