White Hair: కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి!

తెల్ల జుట్టు సమస్యకు ఉల్లి తొక్క శాశ్వత పరిష్కారం అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇది జుట్టు సంబంధిత సమస్యలను తొలగించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు పొడ్డుగా, మెరుస్తూ ఉండటానికి ఉల్లిపాయ తొక్కలను ఎలా ఉపయోగించాలో పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం...

White Hair: కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి!
White Hair Remedy

Updated on: Jan 14, 2026 | 5:04 PM

తెల్ల జుట్టును నల్లగా చేయడానికి ఎలాంటి హెయిర్ డై వాడాల్సిన అవసరం లేదు. బదులుగా, కొబ్బరి నూనెలో చెత్తగా భావించి బయటపడేసిన ఉల్లిపాయ తొక్కలు ఉంటే చాలు..కొద్ది రోజుల్లోనే మీ తెల్ల జుట్టును సహజంగా నల్లగా చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే.. తెల్ల జుట్టు సమస్యకు ఉల్లి తొక్క శాశ్వత పరిష్కారం అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇది జుట్టు సంబంధిత సమస్యలను తొలగించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు పొడ్డుగా, మెరుస్తూ ఉండటానికి ఉల్లిపాయ తొక్కలను ఎలా ఉపయోగించాలో పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం…

కొబ్బరి నూనె వాడటం వల్ల తలలో తేమను కాపాడుకోవచ్చు. జుట్టు రాలడం, చుండ్, నిస్తేజమైన జుట్టు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఉల్లిపాయల మాదిరిగానే, ఉల్లిపాయ తొక్క కూడా జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి అవసరమైన మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మీకు కావలసిందల్లా కొద్దిగా కొబ్బరి నూనె, ఉల్లిపాయ తొక్క. ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు.. కేవలం రెండు నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చడం ఈజీ అవుతుంది. ఎటువంటి హెయిర్ డై అవసరం లేదు. పైగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా లేకుండా ఉంటుంది.

దీనిని ఉపయోగించేందుకు ముందుగా ఒక కప్పు ఉల్లిపాయ తొక్కను తీసుకుని, ఇనుప పాన్‌లో తక్కువ మంట మీద నల్లగా మారే వరకు వేయించాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. కొబ్బరి నూనెను వేయించి, పొడి చేసిన ఉల్లిపాయ తొక్కతో కలిపి మీ జుట్టుకు పూసుకుంటే, మీ నెరిసిన జుట్టు కేవలం రెండు నిమిషాల్లోనే సహజంగా నల్లగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. చుండ్రు సమస్యలకు కూడా ఉల్లిపాయ తొక్కతో పరిష్కారం లభిస్తుంది. దీనికోసం ఉల్లిపాయ తొక్కలను నీటిలో బాగా మరిగించి చల్లార్చుకోవాలి. ఆ తరువాత ఈ నీటితో తలపై కొంత సమయం పాటు మసాజ్ చేయాలి. ఇప్పుడు జుట్టును శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి. ఇది చుండ్రు సమస్యను తొలగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..