ఉల్లి పొట్టే కదా చెత్తబుట్టలో పడేయకండి..స్కిన్ స్పెషలిస్టు తగ్గించలేని జబ్బులు సైతం తగ్గించేస్తుంది..

ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ బాగా తెలుసు, కానీ మీరు డస్ట్‌బిన్‌లో విసిరే ఉల్లిపాయ పొట్టు సైతం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడుతుందని మీకు తెలుసా.

ఉల్లి పొట్టే కదా చెత్తబుట్టలో పడేయకండి..స్కిన్ స్పెషలిస్టు తగ్గించలేని జబ్బులు సైతం తగ్గించేస్తుంది..
Onion

Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2023 | 9:45 AM

ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ బాగా తెలుసు, కానీ మీరు డస్ట్‌బిన్‌లో విసిరే ఉల్లిపాయ పొట్టు సైతం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడుతుందని మీకు తెలుసా. ఈ విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, కానీ ఉల్లిపాయ పొట్టు మనకు అనేక సమస్యల నుండి విముక్తి కల్పించడంలో సహాయపడుతుంది. మరి దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది:

ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగాలి. బహుశా దాని రుచి మీకు నచ్చక పోవచ్చు. కానీ ఆ నీటిలో కొద్దిగా తేనె లేదా బెల్లం వేసుకొని త్రాగవచ్చు. ఇలా రోజూ చేస్తే కొన్ని రోజుల్లోనే మీ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ ను తొలగించుకోవచ్చు. తద్వారా మీ గుండె ఆరోగ్యం బాగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

అలెర్జీ నుంచి ఉపశమనం:

మీరు చర్మం అలెర్జీల సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటితో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మ అలర్జీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

అందమైన జుట్టు:

జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడానికి అమ్మాయిలు కండీషనర్‌, షాంపూ లాంటివి చాలా రకాలుగా ఉపయోగిస్తారు. అయితే ఉల్లిపాయ పొట్టు నీటితో నానబెట్టి ఆ నీటితో వెంట్రుకలను కడుక్కోవాలి. తద్వారా జుట్టు అందాన్ని కాపాడుకోవచ్చు. దీని కోసం, ఖచ్చితంగా ఈ రెమెడీ మీకు అద్భుతం అని నిరూపిస్తుంది.

ముఖంపై మచ్చల నివారణ కోసం:

ముఖంపై మంగు మచ్చలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే వాటి బదులుగా వదిలించుకోవడానికి, మీరు ఉల్లిపాయ పొట్టును ఉపయోగించవచ్చు. దీని కోసం, ఉల్లిపాయ పొట్టును నీటిలో నానబెట్టి అందులో పసుపు కలపండి. మచ్చ ఉన్న ప్రదేశంలో రాయండి. కొన్ని రోజుల్లో మీ ముఖం నుండి మచ్చలు మాయమవుతాయి.

గొంతు నొప్పి:

గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఉల్లిపాయ పొట్టు ఉపశమనాన్ని ఇస్తుంది. దీని కోసం ఉల్లిపాయ పొట్టును వేడి నీటిలో మరిగించి తాగాలి. ఈ ప్రత్యేకమైన ఉల్లిపాయ టీ గొంతు సంబంధిత సమస్యలను తొలగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉల్లిపాయ ఇతర ప్రయోజనాలు:

ఉల్లిపాయ పొట్టును నీటిలో నానబెట్టి దాంతో మొఖం కడుక్కుంటే చర్మంలోని మృతకణాలు తొలగిపోయి, చర్మం మెరుస్తుంది.

ఉల్లిపాయ తొక్కలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి, దీని కారణంగా ముఖం మీద వాపు వంటివి కలగకుండా ఉపశమనం కలుగుతుంది.

ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మపు దద్దుర్లు కూడా ఉపశమనం కలిగిస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..