AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టుకే కాదు ఉల్లిపాయ రసంతో మరెన్నో లాభాలు.. మొండి సమస్యలకు సంజీవని..!

ఉల్లిపాయలోని ఔషధ గుణాలు, పోషక లక్షణాలు శరీరాన్ని అనేక సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మీరు శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే ఉల్లిపాయ బెస్ట్‌ రెమిడీ అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఉల్లిపాయ జ్యూస్‌ తాగడం వల్ల కలిగే లాభాలు, దీన్ని ఎవరు ఎక్కువగా తీసుకోవాలో తెలుసుకుందాం.

జుట్టుకే కాదు ఉల్లిపాయ రసంతో మరెన్నో లాభాలు.. మొండి సమస్యలకు సంజీవని..!
Onion Juice
Jyothi Gadda
|

Updated on: Dec 07, 2025 | 1:20 PM

Share

భారతీయ వంటగదిలో లభించే కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరానికి కూడా మేలు చేస్తాయి. ఉల్లిపాయలు వాటిలో ఒకటి వీటిని అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. సోడియం, పొటాషియం, ఫోలేట్లు, విటమిన్లు ఎ, సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఉల్లిపాయల లక్షణాలు శరీరాన్ని అనేక సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మీరు శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే ఉల్లిపాయ బెస్ట్‌ రెమిడీ అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఉల్లిపాయ జ్యూస్‌ తాగడం వల్ల కలిగే లాభాలు, దీన్ని ఎవరు ఎక్కువగా తీసుకోవాలో తెలుసుకుందాం.

ఉల్లిపాయ రసం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు అధిక రక్తపోటు సమస్యతో ఆందోళన చెందుతుంటే మీరు ఉల్లిపాయ జ్యూస్‌ తీసుకోవచ్చు. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్. ఉల్లిపాయ రసంలో సల్ఫర్‌ సమ్మేళనాలతో పాటుగా ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. బీపీ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఉల్లిపాయ రసంలో తేనె కలిపి తాగడం వల్ల వ్యాధనిరోధశక్తి పెరుగుతుంది. ఉల్లిపాయ రసంలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తాయి. ఉల్లిపాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఉల్లిపాయ రసంలోని క్రోమియం డయాబెటిస్‌ నుంచి రక్షణ అందిస్తుంది. ఉల్లిపాయ రసంలో ఫైబర్‌తో పాటుగా ప్రీబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ రసం తాగితే మలబద్దకం, అజీర్తి తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కణాలు పెరగడాన్ని కంట్రోల్ చేస్తాయి. ఉల్లిపాయ రసం తాగితే క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంట, వాపును కంట్రోల్ చేస్తాయి. ఉల్లిపాయ రసం తాగితే దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి.

ఉల్లిపాయ రసంలోని పోషకాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పిని కంట్రోల్ చేస్తాయి. ఉల్లిపాయ రసం తాగితే శీతాకాలంలో వచ్చే ఈ సమస్యలు తగ్గుతాయి. ఉల్లిపాయ రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయ రసం తాగితే ముడతలు తగ్గుతాయి. మచ్చల్లేని చర్మం పొందవచ్చు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్‌ సమ్మేళనాలు ఉంటాయి. ఉల్లిపాయ రసం రాసుకోవడం, తాగడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
తల్లికి వందనం కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు.. డేట్ ఫిక్స్
తల్లికి వందనం కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు.. డేట్ ఫిక్స్
గర్భధారణకు సరైన వయస్సు ఏది..? ఏ వయస్సు తర్వాత గర్భధారణ ప్రమాదకరం
గర్భధారణకు సరైన వయస్సు ఏది..? ఏ వయస్సు తర్వాత గర్భధారణ ప్రమాదకరం
కొరియన్ డ్రామాలతో కొత్త కష్టాలు! అమ్మాయిలు కోరుకునేది ఇదేనట!
కొరియన్ డ్రామాలతో కొత్త కష్టాలు! అమ్మాయిలు కోరుకునేది ఇదేనట!
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు తలా రీఎంట్రీ..?
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు తలా రీఎంట్రీ..?