ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి తాగుతున్నారా? కొత్త ‘హెల్త్ షాట్’ వల్ల కలిగే లాభాలేంటో తెలుసా

చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆలివ్ ఆయిల్ & లెమన్ జ్యూస్ షాట్ కేవలం వారం రోజులు తీసుకుంటేనే చర్మం కాంతివంతంగా మారిందని, జీర్ణక్రియ మెరుగుపడిందని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. మరికొందరు తమ జుట్టు ఆరోగ్యం, శక్తి స్థాయిలు పెరిగాయంటున్నారు. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలయిక ఒక శక్తివంతమైన 'యాంటీ ఆక్సిడెంట్ బూస్ట్' లా పనిచేస్తుంది.

ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి తాగుతున్నారా? కొత్త ‘హెల్త్ షాట్’ వల్ల కలిగే లాభాలేంటో తెలుసా
Olive Oil And Lemon Juice Shots.jpg

Updated on: Mar 29, 2026 | 6:30 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్ హవా కొనసాగుతోంది. రకరకాల ‘హెల్త్ హ్యాక్స్’ నెట్టింట వైరల్ అవుతుండగా, తాజాగా భారతీయులను అమితంగా ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్ ‘ఆలివ్ ఆయిల్ & లెమన్ జ్యూస్ షాట్’. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక చిన్న గ్లాసులో కొద్దిగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొంత నిమ్మరసం కలిపి తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వెల్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్లు చెబుతున్నారు. మరి ఈ వైరల్ డ్రింక్ నిజంగానే పనిచేస్తుందా?

  • ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌లో గుండెకు మేలు చేసే కొవ్వులు ‘పాలీఫెనాల్స్’ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని నేరుగా ‘షాట్’ రూపంలో తీసుకోవడం వల్ల, వేడికి గురికాకుండా ఉండటం చేత ఇందులోని పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయి. ఆలివ్ ఆయిల్‌కు నిమ్మరసం తోడైతే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, సిట్రిక్ యాసిడ్ లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, కొన్ని రకాల కిడ్నీ రాళ్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

కలిగే ప్రయోజనాలు

  1. జీర్ణక్రియ : ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
  2. చర్మ సౌందర్యం : శరీరంలోని టాక్సిన్లను (విష పదార్థాలు) బయటకు పంపడం వల్ల చర్మం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది.
  3. వాపుల నివారణ- శరీరంలో అంతర్గత వాపులను తగ్గించి, కీళ్ల నొప్పుల వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

ఈ హెల్త్ షాట్ వినడానికి బాగున్నప్పటికీ, అందరి శరీరతత్వాలు ఒకేలా ఉండవు. అధిక మొత్తంలో నూనె తీసుకోవడం వల్ల కొందరిలో కడుపులో అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి, ఏదైనా కొత్త అలవాటును ప్రారంభించే ముందు చిన్న మొత్తంలో ప్రయత్నించడం లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది. “సింపుల్ ఇంగ్రిడియంట్స్ – అమేజింగ్ రిజల్ట్స్” అనే సూత్రం ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం రెండూ వంటింట్లో దొరికేవే కాబట్టి, సహజమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.

Follow Us