Pressure Cooker: వంటగదిలో ప్రెషర్ కుక్కర్ ఉంటే సగం వంట అయిపోయినట్లేనన్న అనుభూతి కలుగుతుంది. కూర చేస్తున్న సమయంలోనే కుక్కర్‌లో అన్నం అయిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కానీ ప్రెషర్ కుక్కర్‌ని అన్ని రకాల పదార్థాల కోసం ఉపయోగించకూడదు. అన్ని రకాల ఆహారాలను కుక్కర్‌లో చేస్తే ఆరోగ్య సమస్యలు లేదా పదార్థాలు పాడయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏయే పదార్థాల కోసం కుక్కర్‌ని ఉపయోగించకూడదో ఇప్పుడు చూద్దాం..
పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, మజ్జిగ లేదా మీగడ వంటి పాల ఉత్పత్తులకు సంబంధించిన వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. కుక్కర్‌లోని అధిక వేడి కారణంగా పాల ఉత్పత్తులు దాని నుంచి పేలిపోవచ్చు, లేదా పదార్ధాలు చెడిపోవచ్చు. అలా చెడిన పదార్థాలను తీసుకున్నట్లయితే మీరు ఆనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.
వేయించిన పదార్థాలు: ప్రెషర్ కుక్కర్‌లో వేపుళ్లను కూడా వండకూడదు. అధిక వేడి, వేడి నూనె కారణంగా, ఆహారం చిందటం జరుగుతుంది. ఫలితంగా మీ శరీరంపై పడి గాయాలకు కారణంగా మారవచ్చు.
పాస్తా, నూడుల్స్: ప్రెషర్ కుక్కర్‌లో పాస్తా, నూడుల్స్ వంటివాటిని కూడా ఉడికించకూడదు. కుక్కర్‌లోని అధిక వేడి కారణంగా అవి ముద్దగా తయారై రుచిని కోల్పోతాయి. ఇంకా వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉంది.
కూరగాయలు: కూరలను చేయడానికి అధిక సమయం పడుతుంది. ఈ కారణంగా ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగించకూడదు. ఒక వేళ ఉపయోగించినట్లయితే.. ఆ కూరలోని పోషకాలు అన్ని తొలగిపోయి, తినే ఆహారం నిష్ప్రయోజకంగా మారుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి