ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్యల్లో రక్తపోటు ప్రధానమైంది. చిన్న వయసు వారు కూడా బీపీ బారిన పడుతున్నారు. గుండె జబ్బుల మొదలు ఎన్నో రకాల సమస్యలకు బీపీ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా రక్తపోటు ఎక్కువవుతోంది. గుండె సంబంధిత సమస్యలకు కూడా బీపీ ప్రధాన కారణంగా నిలుస్తోంది. అయితే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్‌ను గురికాకుండా చూసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు.
* రక్తపోటును అదుపు చేయడంలో టీ కూడా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే రోజూ ఒక కప్పు టీని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. టీ రక్తనాళాలను సడలించడంలో ఉపయోగపడుతుంది. ఇది రక్తపోటును మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. 12 వారాల అధ్యయనం తర్వాత ఈ విషయాలు వెల్లడయ్యాయి.
* తీసుకునే ఆహారంలో పెరుగు ఉంటే రక్తపోటు దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పెరుగులో బ్లూబెర్రీస్ కలుపుకొని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది.
* రక్తపోటును అదుపులో ఉండాలంటే ఉప్పును తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ 6 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదని సూచిస్సుతన్నారు. రోజుకు ఒకటిన్న టీస్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
* వ్యాయామం చేయడం ద్వారా కూడా బీపీ అదుపులో ఉంటుంది. ప్రతీరోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువు ఉంటే గుండె పనీతరు మెరుగ్గా ఉంటుంది.
* మద్యం సేవించడాన్ని పూర్తిగా మానేయాలి. బీపీకి ప్రధాన కారణం మద్యపానం అని చెబుతున్నారు. బోస్టన్ యూనీవర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
* రక్తపోటును అదుపు చేయడంలో మంచి నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ కచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. తక్కువ నిద్రపోయే వారిలో రక్తపోటు వచ్చే అవకాశం 11 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..